NTV Telugu Site icon

Telangana Government: కాంగ్రెస్ మరో హామీ..! నెలాఖరులోగా అమలుకు కసరత్తు..

Revanth Reddy

Revanth Reddy

Telangana Government: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తుంది. అధికారంలోకి రాగానే ఆరు హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ అధికారంలోకి వచ్చి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే హామీల అమలుకు సంబంధించిన ఫైలుపై రేవంత్ రెడ్డి సంతకం చేశారు. అనంతరం డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఆరు హామీల్లో చివరి పథకం కింద రూ.10 లక్షలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అమలు చేశారు. ప్రస్తుతం ఈ రెండూ అమల్లో ఉండగా.. ఈ నెలాఖరులోగా మరో హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 గ్యాస్ సిలిండర్, మహిళలకు రూ.2,500 నెలవారీ స్టైఫండ్ కూడా హామీ ఇవ్వబడింది. అర్హులైన మహిళలకు రూ. 2,500 చెల్లింపు కార్యక్రమం ప్రారంభించబడుతుంది.

Read also: Damodar Raja Narasimha: నేడు నిజామాబాద్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటన..

మరికొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రానున్నందున, అంతకుముందే పథకం అమలుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక శాఖతో చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పథకం కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కర్ణాటకతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలపై అధ్యయనం చేసి ప్రతినెలా ఎంత అవసరమో నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. కర్ణాటకలో దాదాపు మూడున్నర కోట్ల మంది మహిళలు ఉండగా.. వారిలో కోటి 25 లక్షల మందికి నెలవారీ భృతి చెల్లిస్తున్నట్లు సమాచారం. అక్కడ ఇచ్చిన ప్రతిపాదనను తెలంగాణలో కూడా చెల్లిస్తే ఎంత మందికి ఇవ్వాల్సి ఉంటుందనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్థిక పరిస్థితితోపాటు విద్యార్హతలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ నెలాఖరులోగా ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
Ayodhya Ram temple: రామమందిరం, సీఎ యోగికి బాంబు బెదిరింపులు.. ఇద్దరి అరెస్ట్..