NTV Telugu Site icon

KCR Govt: ఇమామ్‌లు, మౌజంలకు గుడ్‌న్యూస్.. మరో 7 వేల మందికి గౌరవ వేతనం

Kcr Govt

Kcr Govt

KCR Govt: మరికొద్ది నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలు ఇప్పటికే దూకుడు పెంచాయి. గెలుపు కోసం తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అందులో భాగంగానే సంక్షేమ పథకాల అమలులో వేగం పెరిగింది. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇప్పటికే రెండో విడత గొర్రెల యూనిట్ల పంపిణీ, బంజరు భూమి పట్టాల పంపిణీ, రైతు బంధు వంటి కార్యక్రమాలు చేపట్టారు. రైతు రుణమాఫీ, రూ.లక్ష సాయం, మైనార్టీలకు గృహలక్ష్మి పథకాల అమలుకు రూ. లక్ష ఆర్థిక సహాయాన్ని రూపొందించారు. తాజాగా రాష్ట్రంలోని మరో 7,005 మంది ఇమామ్ లు, మౌజమ్ లకు నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన శాసనసభ వర్షాకాల సమావేశాల్లో గౌరవ వేతనం పొందుతున్న ఇమామ్‌లు, మౌజామ్‌ల లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు.

Read also: Minister KTR: నేతన్న బీమా అర్హత వయస్సు పెంపు.. ఎంతంటే..?

ఈనేపథ్యంలో.. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 10 వేల మంది మౌజమ్‌లు, ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇస్తున్నట్లు తెలిపారు. మరో 7 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని.. అన్నింటికి రేపు సాయంత్రంలోగా ఉత్తర్వులు ఇస్తామని ఆదివారం జరిగిన సమావేశాల్లో వెల్లడించారు. హిందూ దేవాలయాల్లో పూజలు చేసే పూజారులకు ఇచ్చే విధంగా మౌజమ్‌లు, ఇమామ్‌లకు కూడా అందజేస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. సీఎం మాట ప్రకారం.. మరో 7,005 మంది మౌజమ్‌లు, ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే 9,995 మంది ఇమామ్ లు, మౌజామ్ లు నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం పొందుతుండగా, కొత్తగా చేరిన వారితో కలిపి రాష్ట్రవ్యాప్తంగా గౌరవ వేతనం అందుకుంటున్న ఇమామ్ లు, మౌజమ్ ల సంఖ్య 17 వేలకు చేరింది. ఈ పథకం కింద మసీదుల ఇమామ్‌లు, మౌజమ్‌లకు రూ. 1000 గౌరవ వేతనం ఇచ్చేవారు ఆతరువాత.. 1500 ఆపై రూ. 5,000 పెంచడంతో ఇమామ్‌లు, మౌజంలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
IT Returns : పెరుగుతున్న పన్ను చెల్లింపు దారులు.. కోటీశ్వరులే ఎక్కువ మంది ఉన్నారు