Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Government Has Prepared The Panel List For The Appointment Of New Officers

Telangana: ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల పేర్లు ఈసీకి పంపిన సీఎస్‌

Published Date :October 13, 2023 , 10:14 am
By Bhanu
Telangana: ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల పేర్లు ఈసీకి పంపిన సీఎస్‌
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఎన్నికలు ముగిసే వరకు వారికి ఎలాంటి ఎన్నికల విధులు కేటాయించవద్దని సీఎస్‌ను ఆదేశించింది. నలుగురు కలెక్టర్లతో పాటు మరికొందరు పోలీసులు, ఇతర అధికారులను బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పంపిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఈ మేరకు ఆ స్థానాల్లో అధికారుల బదిలీలు, కొత్త అధికారుల నియామకానికి సంబంధించిన జాబితాను ప్యానెల్ సిద్ధం చేసి ఈసీకి పంపింది. రవాణా శాఖ కార్యదర్శి, ఎక్సైజ్ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ డైరెక్టర్‌తో పాటు నలుగురు కలెక్టర్లు, ముగ్గురు సీపీలు, 10 మంది ఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ బుధవారం ఆదేశించింది. ఒక్కో పోస్టుకు ముగ్గురు అధికారులతో కూడిన ప్యానెల్ జాబితాను సిద్ధం చేసిన సీఎస్ శాంతికుమారి.. ఆ జాబితాను గురువారం ఈసీకి పంపారు. అందులో నుంచి ఒక్కో అధికారిని ఈసీ ఎంపిక చేస్తుంది. ఎంపికైన అధికారుల జాబితాను శుక్రవారం సాయంత్రంలోగా సీఎస్‌కు పంపనున్నారు. కాగా, ఒక్కో పోస్టుకు సీనియారిటీ ఆధారంగా ముగ్గురు అధికారుల పేర్లను పంపాలని సీఎస్‌ను ఈసీ ఆదేశించింది. ఆ మేరకు జాబితా సిద్ధం చేసి సీఎస్ ఈసీకి పంపారు.

హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లతో పాటు 10 జిల్లాలకు ఎస్పీల పేర్లను డీజీపీ సీఎస్‌కు పంపారు. సీఎస్, జీఏడీ కార్యదర్శి కలిసి రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లా కలెక్టర్ పోస్టులకు పలువురు ఐఏఎస్‌ల పేర్లను ఎంపిక చేశారు. ఒక్కో జిల్లాకు ముగ్గురు చొప్పున మొత్తం 12 మంది ఐఏఎస్‌ల పేర్లను ఈసీకి పంపారు. ట్రాన్స్‌పోర్ట్ సెక్రటరీ, ఎక్సైజ్ కమిషనర్, కమర్షియల్ టాక్సెస్ డైరెక్టర్ పోస్టులకు ఒక్కొక్కరు ముగ్గురి పేర్లతో 9 మంది పేర్లను ప్రతిపాదించారు. మొత్తం 20 పోస్టులకు గానూ 60 మంది పేర్లను ఈసీకి పంపిన సంగతి తెలిసిందే. ఈసీ ఆదేశాల మేరకు ఒక్కో అధికారికి సంబంధించిన పూర్తి వివరాలను నివేదికలో పొందుపరిచారు. ప్రతి అధికారికి ఐదేళ్ల పనితీరు, విజిలెన్స్ నివేదికలు అందజేశారు.

Also Read

  • Narendra Modi : సీఎం రేవంత్‌కు మోడీ కౌంటర్‌..
  • CM Revanth Reddy: గుజరాత్‌కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..
  • Kishan Reddy : తెలంగాణకు శుభవార్త.. త్వరలోనే రీజినల్‌ రింగు రోడ్డు పనులు..!
  • PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్‌ టూ మినిట్‌ అప్డేట్స్‌..!
Add as a preferred
source on google

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పై ఈసీ బదిలీ కావడంతో ఎవరిని నియమిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పోస్టు అడిషనల్ డీజీ హోదాలో ఉండటంతో ఆ హోదాలో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను డీజీపీ పంపినట్లు తెలుస్తోంది. అదనపు డీజీల సీనియారిటీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కాగా, శివధర్ రెడ్డి, అభిలాష్ బిస్త్, చికాగోయల్, వీవీ శ్రీనివాస్ రావు, మహేశ్ భగవత్, సజ్జనార్, నాగిరెడ్డి తర్వాత స్థానాల్లో ఉన్నారు. వీరిలో ముగ్గురి పేర్లు పంపాల్సి ఉండగా.. ఎవరి పేర్లు ఈసీకి వెళ్లాయన్నది ఆసక్తికరంగా మారింది. వరంగల్, నిజామాబాద్ కమిషనర్ పోస్టులకు ఐజీ ర్యాంక్ ఐపీఎస్ అధికారుల పేర్లను పంపారు. జిల్లాల్లో ఎస్పీల పోస్టింగ్‌లకు పలువురు ఐపీఎస్‌ల పేర్లు ప్రతిపాదించారు. మూడు కమిషనర్లు, 10 ఎస్పీ పోస్టుల కోసం 39 మంది పేర్లతో కూడిన జాబితాను సీఎస్ ఈసీకి పంపారు.
Pooja Hegde: బుట్టబొమ్మ బర్త్ డేకి ఒక్క సినిమా అప్డేట్ కూడా లేదేంటి?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • appointment
  • bjp
  • BRS
  • EC
  • kcr

తాజావార్తలు

  • PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్‌లో మోడీ సందడి.. పర్యటన మినిట్‌ టూ మినిట్‌ అప్డేట్స్‌..!

  • Tamil Nadu Election Twist: తమిళ రాజకీయాల్లో మళ్లీ ట్విస్ట్.. మద్రాస్ హైకోర్టు మెట్లు ఎక్కిన మాజీ మంత్రి!

  • PM Modi Telangana Visit: తెలంగాణపై మోడీ వరాల జల్లు.. రూ.9,377 కోట్లతో పలు ప్రాజెక్టులకు శ్రీకారం

  • Narendra Modi : సీఎం రేవంత్‌కు మోడీ కౌంటర్‌..

  • Mamata Banerjee: మమత పార్టీలో ముసలం.. నేతల తిరుగుబాటు మొదలు..

  • CM Revanth Reddy: గుజరాత్‌కు మన్మోహన్ చేసినట్లే తెలంగాణకు మోడీ సహకరించాలి..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions