Site icon NTV Telugu

MLC Kavitha: మహిళలకు ప్రత్యేక పథకాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమే

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో చర్చ కొనసాగుతుంది. మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహిళలకు ప్రత్యేక పథకాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుంటే కాళ్ళలో కట్టెలు పెడుతున్నారు ప్రతిపక్ష నాయకులంటూ మండిపడ్డారు. మండలిలో కంటి వెలుగు సెంటర్ ఏర్పాటు చేయాలని అన్నారు.

Read also: KTR: ఇటువైపు ఉన్నప్పుడు బాగానే ఉన్నారు.. అటు వెళ్లాక మారిపోయారు

మహిళలకు ప్రత్యేక పథకాలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు కవిత. రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మీ, న్యూట్రిషన్ కిట్, కేసీఆర్ కిట్ అందరికీ ఇస్తున్నామని గుర్తుచేశారు. 54,000 మంది మిడ్ డే మిల్స్ వండే కార్మికులు ఉన్నారని తెలిపారు. వాళ్లకు మొన్నటి వరకు 1,000రూపాయల జీతం ఇచ్చే వాళ్ళము వాళ్ల కోరిక మేరకు వారికి ఇప్పుడు3,000 రూపాయలు జీతం ఇస్తున్నామని కవిత అన్నారు. అందులో 600 రూపాయలు మాత్రమే కేంద్రం ఇస్తుందని కానీ.. రాష్ట్రం 2,400 రూపాయలు ఇస్తుందని కవిత పేర్కొన్నారు.
KTR : రోజుకు మూడు డ్రస్‌ లు మార్చడం కాదు.. విజన్‌ ప్రకారం పనిచేయాలి

Exit mobile version