Telangana Govt: ఆరోజు వేతనంతో కూడిన సెలవు.. పోలింగ్ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం
Telangana Govt: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 3న నోటిఫికేషన్, నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న పోలింగ్.. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం పోలింగ్ జరిగే నవంబర్ 30వ తేదీని వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించింది. పోలింగ్ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ప్రకటించారు. నవంబర్ 29న పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన సంస్థలు, కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించామని.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగే కార్యాలయాలకు సెలవు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉండగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, నిధులు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు పోలింగ్ నిర్వహణ, ఏర్పాట్లపై ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్‌ల నిల్వ కోసం రూ. 19.45 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను వీవీప్యాట్‌లు, ఈవీఎంల నిల్వ కోసం గోదాముల నిర్మాణానికి వినియోగించనున్నారు. సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రకటనలు మరియు చెల్లింపు కథనాలను పర్యవేక్షించడానికి రాష్ట్ర స్థాయి మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి సీఈవో చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
Voter ID : మీ ఓటర్ ఐడి కార్డు పోయిందా? ఇలా చేస్తే క్షణాల్లో కార్డు ను పొందోచ్చు..
Also Read
- Kavitha: ప్రస్తుత పాలకులకు అమ్మతనం లేదు.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు
- Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
తాజావార్తలు
-
Palak Paratha Recipe: పిల్లల కోసం హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. ఐరన్ పెంచే పాలకూర పరాటా.. రుచి చూస్తే చపాతీల కంటే ఇదే కావాలంటారు!
-
Akhil-Lenin: అదే పెద్ద ప్లస్ పాయింట్.. ఇక ‘లెనిన్’కు తిరుగులేదు!
-
Veg Pulao Recipe: లంచ్ బాక్స్‌కు బెస్ట్ ఛాయిస్.. రెస్టారెంట్ స్టైల్ వెజ్ పులావ్.. ఇంట్లోనే ఈజీగా చేయండిలా..
-
Iran-US: మళ్లీ పశ్చిమాసియాలో యుద్ధం మొదలు కాబోతుందా? ఇరాన్ సైన్యం హై అలర్ట్!
-
Air India to Cut Flights: ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం..! వేరే దారి లేదు మరి..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!