ప్రతీ నెలలో రెండో శనివారం వచ్చిందంటే సాధారణంగా సెలవు ఉంటుంది.. కానీ, ఈ నెలలో అంటే రేపు 12వ తేదీన రాబోతున్న రెండో శనివారం రోజు మాత్రం అన్ని యథావిథిగా పనిచేయనున్నాయి. దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలు ఈ నెల 12వ తేదీన యథావిథిగా పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండో శనివారం రోజు స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు పనిచేయడం ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. విషయం ఏంటంటే.. సెప్టెంబర్ 9న గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం సాధారణ సెలవుగా ప్రకటించింది. అందుకు బదులుగా ఈ నెల 12న సెలవులను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 9న గణేష్ నిమజ్జనం సందర్భంగా.. హైదరాబాద్-సికింద్రాబాద్‌తో పాటు వాటిని ఆనుకొని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.. ఇప్పుడు రెండో శనివారం వర్కింగ్ డే కూడా ఆ జిల్లాల పరిధిలోనే ఉండబోతోంది.
Holiday Cancelled: విద్యార్థులు, ఉద్యోగులకు అలర్ట్.. రెండో శనివారం సెలవు రద్దు.. ఎందుకంటే..?

Telangana