Holiday Cancelled: విద్యార్థులు, ఉద్యోగులకు అలర్ట్.. రెండో శనివారం సెలవు రద్దు.. ఎందుకంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతీ నెలలో రెండో శనివారం వచ్చిందంటే సాధారణంగా సెలవు ఉంటుంది.. కానీ, ఈ నెలలో అంటే రేపు 12వ తేదీన రాబోతున్న రెండో శనివారం రోజు మాత్రం అన్ని యథావిథిగా పనిచేయనున్నాయి. దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కాలేజీలు ఈ నెల 12వ తేదీన యథావిథిగా పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండో శనివారం రోజు స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు పనిచేయడం ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. విషయం ఏంటంటే.. సెప్టెంబర్ 9న గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం సాధారణ సెలవుగా ప్రకటించింది. అందుకు బదులుగా ఈ నెల 12న సెలవులను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌లో సెప్టెంబర్ 9న గణేష్ నిమజ్జనం సందర్భంగా.. హైదరాబాద్-సికింద్రాబాద్‌తో పాటు వాటిని ఆనుకొని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.. ఇప్పుడు రెండో శనివారం వర్కింగ్ డే కూడా ఆ జిల్లాల పరిధిలోనే ఉండబోతోంది.
Also Read
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- Medak: ఉమ్మడి మెదక్‌లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
- Hyderabad: అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
తాజావార్తలు
-
MS Dhoni: ఎంఎస్ ధోనీ క్రేజ్ చూసి పిచ్చెక్కిపోయింది.. మహీ చిరకాల ప్రత్యర్థి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Chiru158: చిరు158కి థమన్ ఫిక్స్.. మెగా మాస్‌కి మ్యూజికల్ బ్లాస్ట్ రెడీ!
ట్రెండింగ్
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!