NTV Telugu Site icon

Telangana : ఖమ్మంలో ఘోర ప్రమాదం..కాళ్ల పారాణి ఆరకముందే కబలించిన మృత్యువు..

Khamma Accident

Khamma Accident

మృత్యువు ఎప్పుడు ఎలా.. ఎక్కడ వస్తుందో చెప్పడం కష్టం.. ఆ సమయం వస్తే మనం గుడిలో ఉన్నా కూడా గుండె ఆగుతుందని పెద్దలు చెబుతున్నారు.. తాజాగా జరిగిన ఘటన అందరి చేత కంటతడి పెట్టిస్తుంది.. జీవితంలో మరో అడుగు వేసిన ఓ యువతి కొత్తగా ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది.. కొత్త జీవితాన్ని ప్రారంభించింది.. కానీ మృత్యువు ఆమె సంతోషాన్ని ఓర్వలేక తీసుకెళ్లిపోయింది..కాళ్ల పారాణి ఆరకముందే కబలించివేసింది.. పెళ్ళైన కొద్ది రోజులకు రోడ్డు ప్రమాదంలో మరణించింది.. ఈ దారుణ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది..

సరదాగా భర్తతో కలసి కు వెళ్తూ ప్రమాదానికి గురై ప్రాణాలను పోగొట్టుకుంది నవ వధువు. కారు ప్రమాదంలో గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాధ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…ఖమ్మం పట్టణ శివారు టేకులపల్లి కి చెందిన సంధ్యకు ఐదు నెలల క్రితమే పెళ్లి అయింది. సంధ్య తన భర్తతో కలిసి నందిగామ మండలం కొంతమత్కూరులోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడ సరదాగా సినిమా చూద్దామని భావించిన ఈ దంపతులు రాత్రి ద్విచక్ర వాహనం బుల్లెట్‌పై చూసేందుకు మధిరకి బయలుదేరారు.. అంతే అదే వారిద్దరి జీవితంలో చివరి ప్రయాణం..

అయితే దారి మధ్యలోనే ప్రమాదం జరిగింది..ఎదురుగా వస్తున్న కారు వీరి బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంధ్య తీవ్రంగా గాయపడింది. తలకి బలమైన గాయం కావడంతో సంఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందింది. సంధ్య భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. ఐదు నెలల క్రితమే పెళ్ళై కొత్త జీవితాన్ని మొదలు పెట్టిన సంధ్య.. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఇరు కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు… ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. కొత్త కాపురం మొదలు పెట్టగానే అమ్మాయి చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి.. స్థానికులు కూడా కంట తడి పెడుతున్నారు..