Telangana : ఖమ్మంలో ఘోర ప్రమాదం..కాళ్ల పారాణి ఆరకముందే కబలించిన మృత్యువు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మృత్యువు ఎప్పుడు ఎలా.. ఎక్కడ వస్తుందో చెప్పడం కష్టం.. ఆ సమయం వస్తే మనం గుడిలో ఉన్నా కూడా గుండె ఆగుతుందని పెద్దలు చెబుతున్నారు.. తాజాగా జరిగిన ఘటన అందరి చేత కంటతడి పెట్టిస్తుంది.. జీవితంలో మరో అడుగు వేసిన ఓ యువతి కొత్తగా ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంది.. కొత్త జీవితాన్ని ప్రారంభించింది.. కానీ మృత్యువు ఆమె సంతోషాన్ని ఓర్వలేక తీసుకెళ్లిపోయింది..కాళ్ల పారాణి ఆరకముందే కబలించివేసింది.. పెళ్ళైన కొద్ది రోజులకు రోడ్డు ప్రమాదంలో మరణించింది.. ఈ దారుణ ఘటన తెలంగాణాలో వెలుగు చూసింది..
సరదాగా భర్తతో కలసి కు వెళ్తూ ప్రమాదానికి గురై ప్రాణాలను పోగొట్టుకుంది నవ వధువు. కారు ప్రమాదంలో గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాధ ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…ఖమ్మం పట్టణ శివారు టేకులపల్లి కి చెందిన సంధ్యకు ఐదు నెలల క్రితమే పెళ్లి అయింది. సంధ్య తన భర్తతో కలిసి నందిగామ మండలం కొంతమత్కూరులోని బంధువుల ఇంటికి వచ్చారు. అక్కడ సరదాగా సినిమా చూద్దామని భావించిన ఈ దంపతులు రాత్రి ద్విచక్ర వాహనం బుల్లెట్‌పై చూసేందుకు మధిరకి బయలుదేరారు.. అంతే అదే వారిద్దరి జీవితంలో చివరి ప్రయాణం..
Also Read
- Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
- KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్‌కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
అయితే దారి మధ్యలోనే ప్రమాదం జరిగింది..ఎదురుగా వస్తున్న కారు వీరి బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంధ్య తీవ్రంగా గాయపడింది. తలకి బలమైన గాయం కావడంతో సంఘటనా స్థలంలోనే ఆమె మృతి చెందింది. సంధ్య భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. ఐదు నెలల క్రితమే పెళ్ళై కొత్త జీవితాన్ని మొదలు పెట్టిన సంధ్య.. ఇంతలోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో ఇరు కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు… ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. కొత్త కాపురం మొదలు పెట్టగానే అమ్మాయి చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి.. స్థానికులు కూడా కంట తడి పెడుతున్నారు..
తాజావార్తలు
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
-
Asim Munir: టెహ్రాన్‌కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
-
IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!