ESI Scam : ESIలో ఇదేం దందా.? క్లీనింగ్ కాంట్రాక్ట్‌లో కోట్ల కుంభకోణం..
- చదరపు అడుగుకు రూ.10 నుంచి రూ.49.50కి పెరిగిన ధర
- నాలుగు ఈఎస్ఐ ఆసుపత్రుల్లో కాంట్రాక్టుల కేటాయింపుపై ఆరోపణలు
- ఏటా రూ.29.25 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రజా సంఘాల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐ) ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కాంట్రాక్టుల కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో తీవ్ర సంచలనం రేగుతోంది. నాచారం, రామచంద్రాపురం, వరంగల్, జీడిమెట్లలోని నాలుగు ప్రధాన ఈఎస్ఐ ఆసుపత్రుల్లో క్లీనింగ్ కాంట్రాక్ట్ ధరలను అకస్మాత్తుగా భారీగా పెంచడంపై వివాదం నెలకొంది. చదరపు అడుగుకు రూ.10గా ఉన్న రేటును ఏకంగా రూ.49.50కి పెంచేయడంతో ప్రభుత్వ ఖజానాపై ఏటా దాదాపు రూ.29.25 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. నిబంధనలను పక్కనపెట్టి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడంపై కార్మిక వర్గాలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
నిబంధనల ఉల్లంఘన.. అధికారుల రికమండేషన్లు పక్కనపెట్టి కేటాయింపులు
ఈ పారిశుద్ధ్య కాంట్రాక్టు రేట్ల పెంపు ప్రక్రియలో తీవ్రస్థాయిలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఇలాంటి కాంట్రాక్టులకు బహిరంగ టెండర్లు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండానే కాంట్రాక్టులను అప్పగించినట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన అధికారుల కమిటీలు చదరపు అడుగుకు రూ.13.65 నుంచి రూ.25 వరకు మాత్రమే సిఫారసు చేసినప్పటికీ, ఆ నివేదికలను పక్కనపెట్టేశారు. అధికారుల సిఫారసులను తొక్కిపెట్టి, ఊహించని రీతిలో అధిక రేట్లకు ఒప్పందాలు కుదుర్చుకోవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read
- Konda Surekha: "అప్పట్లో రాజకీయ పరిస్థితుల వల్లే అలా అన్నాను".. కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
- Hyderabad: రేస్ క్లబ్ సమీపంలో భారీ పేకాట స్థావరం గుట్టురట్టు.. 12 మంది అరెస్ట్.!
- Hyderabad: తెలంగాణలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కొరడా.. 32 మెడికల్ షాపులకు నోటీసులు
- Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
ఐఏఎస్ అధికారి హస్తం? ఐఏఎస్ కోచింగ్ అకాడమీ యజమానికి లబ్ధి
ఈ పారిశుద్ధ్య అక్రమాల వెనుక ఒక ఉన్నతాధికారి హస్తం ఉందనే ప్రచారం జోరందుకుంది. ఒకే అవుట్సోర్సింగ్ సంస్థకు నామినేషన్ పద్ధతిలో ఈ కాంట్రాక్టును కట్టబెట్టడం వెనుక ఓ ఐఏఎస్ అధికారి చక్రం తిప్పారనే ఆరోపణలు వస్తున్నాయి. సదరు అధికారి ఒక ప్రముఖ సివిల్స్ కోచింగ్ అకాడమీ యజమాని కుటుంబానికి లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే నిబంధనలను నీరుగార్చి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. సొంత ప్రయోజనాలు , అనుకూల సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే ఈఎస్ఐ నిధులను విచ్చలవిడిగా అప్పగించారని విమర్శకులు మండిపడుతున్నారు.
గతంలోనూ రూ.300 కోట్ల మందుల కుంభకోణం
ఈఎస్ఐ విభాగంలో అవినీతి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ రూ.300 కోట్ల మేర మందుల కొనుగోలు కుంభకోణం వెలుగుచూసి రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ తర్వాత టెలీమెడిసిన్ సేవ ల పేరుతో మరొక రూ.9 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వరుసగా కుంభకోణాలు బయటపడుతున్నప్పటికీ అధికారుల్లో మార్పు రాకపోవడం, కార్మికుల సంక్షేమం కోసం కేటాయించిన నిధులు దుర్వినియోగం కావడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్
ఈఎస్ఐ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ అక్రమాలపై తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే ఆసుపత్రుల్లో క్లీనింగ్ కాంట్రాక్టులను పునఃసమీక్షించి, కార్మికులు , వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పారదర్శకమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
ESI Scam : ESIలో ఇదేం దందా.? క్లీనింగ్ కాంట్రాక్ట్‌లో కోట్ల కుంభకోణం..
-
Pan-India: ప్లాన్ చేస్తే పాన్ ఇండియా అవ్వదు: త్రివిక్రమ్
-
Gold Hunt: ఓ వైపు తుఫాన్.. మరోవైపు ఉప్పాడ తీరంలో బంగారం కోసం వేట..
-
Thaman: నాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇచ్చింది త్రివిక్రమ్
-
CM Chandrababu : ‘అర్నాబ్’ తుఫాన్ నష్టం రూ.4,563 కోట్లు.. రైతులకు రూ.6 వేల సాయం
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..