NTV Telugu Site icon

Vijayashanti: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విజయశాంతి

Vijayashanti

Vijayashanti

Vijayashanti Joins in Congress Party: రోజురోజుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన రావడంతో నేతల్లో అసంతృప్తులు, పార్టీల మార్పులతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఇటీవల ఆమె బీజేపీకి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆమె తిరిగి తన సొంతగూటికే చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. అవే నిజం చేస్తూ శుక్రవారం విజయ శాంతి హస్తం పార్టీలో చేరారు.

Also Read: BJP Telangana Manifesto: BJP మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు..!

హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న గాంధీభవన్‌లో మల్లికార్జున ఖర్గే.. ఆమెకు కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు విజయశాంతి ట్వీట్ చేశారు. ‘ఎంతో ఆదరణతో, సమున్నతమైన గౌరవంతో స్వాగతించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు..’ అంటూ తనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. కాగా మెదక్ లోక్ సభ సీటు హామీతోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read: Viral Video: కనకవర్షం కురిపించిన ఏటీఎం.. షాకింగ్‌ వీడియో..