Telangana El Nino : ఎల్‌నినో ముప్పు.. రంగంలోకి కేబినెట్ సబ్ కమిటీ.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ముంచుకొస్తున్న ఎల్‌నినో పరిస్థితులు, తీవ్ర కరువు ఛాయలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విపత్కర వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి, సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేయడంతో పాటు తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సిఫారసులు చేసేందుకు ఒక ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ ఆర్టీ నంబర్ 1523ను జారీ చేసింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ సబ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క)తో పాటు మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సభ్యులుగా నియమితులయ్యారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర సమీక్షలు
ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గి, భూగర్భ జలాలపై తీవ్రమైన ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉన్నందున ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వేసవికి ముందే నీటి ఎద్దడి సమస్యలను గుర్తించి పరిష్కరించడం, అందుబాటులో ఉన్న జల వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, గ్రామీణ ప్రజలకు నిరంతరం సురక్షితమైన తాగునీరు అందేలా చూడటంలో ఈ శాఖ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోంది.
Also Read
- Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
- Trap: తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి భార్యకు చైనా ఏజెంట్ల వల
- Harish Rao : జర్మనీ ఉద్యోగాల పేరుతో మోసమా? టామ్కామ్పై హరీష్ రావు ఫైర్
- El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
జల సంరక్షణకు పెద్దపీట.. ఇంకుడు గుంతలు, ఊట కుంటల నిర్మాణం
తాగునీటి భద్రతతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం జల సంరక్షణకు పంచాయతీరాజ్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వర్షపు నీటిని వృథాగా పోనివ్వకుండా ఒడిసిపట్టి, భూగర్భ జలాలను పెంపొందించే దిశగా కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా గ్రామాల్లో ఇంకుడు గుంతలు, పంట గుంతలు, ఊట కుంటల నిర్మాణం మరియు వాటి నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. నీటి వనరులను సంరక్షించడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే నీటి కొరతను సమర్థవంతంగా నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేబినెట్ సబ్ కమిటీ మార్గదర్శకత్వంలో అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతూ రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావాన్ని తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధమవుతున్నాయి.
తాజావార్తలు
-
Chiranjeevi : కాక తర్వాత చిరు నెక్స్ట్ ఎవరితో?
-
Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమాపై మహేష్ బాబు ఫ్యాన్స్ ఫైర్..
-
BCCI Chief Selector: టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. సెలక్షన్ కమిటీలోకి రమేష్ పవార్.!
-
WhatsApp: ప్రైవసీ నుంచి మెసేజ్ మేనేజ్మెంట్ వరకు.. వాట్సాప్‌లో ఎప్పుడయినా ఈ ఫీచర్స్‌ను ఉపయోగించారా.?
-
Telangana El Nino : ఎల్‌నినో ముప్పు.. రంగంలోకి కేబినెట్ సబ్ కమిటీ.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఆ ముగ్గురిలో ఒకరు తప్పుకుంటూనే వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు.!
-
108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!