హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ అనుమతిని పునరుద్ధరించింది విద్యాశాఖ.. ఇదే సమయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది… ఈ విద్యా సంవత్సరానికి తాత్కాలిక అనుమతిని ఇచ్చిన విద్యాశాఖ.. తాము సూచించిన నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.. కాగా, పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి ఘటన చోటు చేసుకోవడంతో ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేసింది విద్యాశాఖ.. దీనిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.. మధ్యలో స్కూల్ అనుమతులు రద్దు చేస్తే.. తమ పిల్లల పరిస్థితి ఏంటి? అంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలలను పునర్ ప్రారంభించారని తల్లిదండ్రులు వేడుకున్నారు.. దీంతో ఈ విద్యా సంవత్సరానికి పాఠశాలలను కొనసాగించవచ్చని అనుమతి ఇచ్చింది విద్యాశాఖ.
Read Also: CEC on Komatireddy Raj Gopal Reddy: రాజగోపాల్‌రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ.. ఆధారాలు లేవు..!
కాగా, డీఏవీ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిపై అదే పాఠశాల ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీ కుమార్ లైంగిక దాడి ఘటన కలకలం సృష్టించిన విషం తెలిసిందే.. ప్రిన్సిపాల్ గదికి పక్కనే ఈ దారుణం జరిగినా ప్రిన్సిపాల్ మాధవి నిరోధించకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన డ్రైవర్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రజనీ కుమార్‌తో పాటు ప్రిన్సిపాల్ మాధవీపైనా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.. ఇక, అత్యాచార ఘటనపై సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం.. స్కూల్ గుర్తింపును రద్దు చేసింది. అయితే, పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో వుంచుకుని స్కూల్ రీ ఓపెనింగ్‌కు అనుమతించాలంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.. దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.. దీంతో.. చివరకు డీఏవీ స్కూల్‌కు మళ్లీ తాత్కాలిక అనుమతి ఇచ్చింది విద్యాశాఖ.
