”హలో సార్.. మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం.. అంటూ క్రెడిట్‌కార్డు, పర్సనల్ లోన్, హోమ్‌లోన్, ఇన్సూరెన్స్ ల పేరుతో చేసే ఫోన్కాల్స్అన్ని నిజమైనవి కాకపోవచ్చు. మీతో మాట్లాడుతున్న టెలీ కాలర్స్సైబర్నేరగాళ్లు ఆపరేట్‌చేస్తున్న కాల్‌సెంటర్ల నుంచి ఫోన్చేస్తుండొచ్చు. అలర్ట్‌గా ఉండాల్సిందే. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలను తెలంగాణ పోలీసులు ట్రేస్ చేశారు. ఐటీ కంపెనీల తరహా కాల్‌సెంటర్స్ ఏర్పాటు చేస్తున్న సైబర్‌నేరగాళ్లు కన్సల్టెన్సీల ద్వారా నిరుద్యోగ యువతను తక్కువ జీతాలకు టెలీకాలర్స్‌గా రిక్రూట్చేసుకుంటూ వాళ్లతో ఫ్రాడ్ చేయిస్తున్నారు. బ్యాంక్ కస్టమర్ల డేటాను ఏజెన్సీల ద్వారా కొంటున్న ఈ దుండగులు.. ఆ వివరాలతో టెలీకాలర్స్ ద్వారా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం.. అంటూ ఫోన్లు చేయించి డబ్బు కాజేస్తున్నారు. ఇలాంటి తరహా కాల్‌సెంటర్లు ఢిల్లీ, కోల్‌కతా, రాజస్థాన్, యూపీతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 15 చోట్ల పని చేస్తున్నట్లు తెలంగాణ సైబర్క్రైమ్పోలీసులు గుర్తించారు.
ఢిల్లీలో రెండు కాల్ సెంటర్స్‌పై రైడ్స్
డబ్బు పోగొట్టుకున్నామంటూ.. పోలీసులను ఆశ్రయించిన బాధితుల వద్ద నుంచి ఫోన్ నంబర్స్ తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వాటిని ట్రేస్ చేశారు. ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న రెండు కాల్ సెంటర్స్‌పై సోమ, మంగళవారం రెండు రోజులు రైడ్స్ చేశారు. 24 మందిని అదుపులోకి తీసుకొని, ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కాగా ఈ రైడ్స్‌లో పోలీసులు కీలక అంశాలు గుర్తించారు. కాల్‌సెంటర్స్ నిర్వహణపై ఆధారాలు సేకరించారు. గత నెల 17న కూడా ఇలాంటి కేసునే తెలంగాణ పోలీసులు ట్రేస్ చేశారు. ఆర్‌బీఎల్ క్రెడిట్‌కార్డు హోల్డర్లను మోసం చేస్తున్న16 మంది సభ్యుల ఢిల్లీ గ్యాంగ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ఫేక్ కాల్‌సెంటర్స్ పై దాడులు చేసి 1865 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ కస్టమర్ల డేటా సంపాదించి ఫేక్కాల్స్చేస్తూ.. బల్క్మేసేజ్ లు, లింక్‌లు పంపుతూ అకౌంట్స్‌లో డబ్బులు కాజేస్తున్నట్లు గుర్తించారు.
టెలీ కాలర్స్‌కు అనుమానం రాకుండా
టెలీ కాలర్స్‌గా పనిచేస్తున్న ఉద్యోగులకు సైబర్ నేరగాళ్లు ఎలాంటి అనుమానం రానివ్వడం లేదు. బ్యాంకుల క్రెడిట్ కార్డులు, లోన్లు, బీమా తదితర థర్డ్ పార్టీ ఏజెన్సీలుగా నమ్మించి టెలీ కాలర్స్‌తో కస్టమర్లకు కాల్ చేయిస్తున్నారు. కస్టమర్ల బ్యాంక్ అకౌంట్ పూర్తి వివరాలు కొట్టేసి.. ఖాతాలో ఉన్న డబ్బును వారి ఈ వ్యాలెట్‌లోకి డైవర్ట్ చేసుకుంటున్నారు. ఇలాంటి నేరాల్లో సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్న రైడ్స్‌లో టెలీకాలర్స్మాత్రమే చిక్కుతున్నారు. సైబర్ క్రిమినల్స్ నిర్వహిస్తున్న కాల్ సెంటర్స్‌లో తాము పనిచేస్తున్న విషయం తెలుసుకుని వాళ్లు భయాందోళనకు గురవుతున్నారు.

కాల్ సెంటర్ అంటేనే ప్రజలకు ఒక నమ్మకం. కాల్ సెంటర్ లు అన్ని కూడా ప్రభుత్వ కంట్రోల్లో నడుస్తుంటాయి. దీనికి తోడు అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు కూడా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసుకుంటాయి. తమ కాల్ సెంటర్ నెంబర్లను ఎక్కడెక్కడ డిస్ప్లే చేస్తుంటారు. ఈ కాల్ సెంటర్ తో కస్టమర్లతో అధికారులు డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే కాల్ సెంటర్ నకిలిది అయితే ఎవరికి చెప్పుకోవాలి. ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఇది .. అంతే కాకుండా నకిలీ కాల్ సెంటర్ వ్యవహారం ఇప్పుడు ప్రముఖ సంస్థలకు తలనొప్పిగా మారాయి. నకిలీ కాల్ సెంటర్ లో తమ కస్టమర్లను ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసి కూడా ప్రభుత్వ సంస్థలు ఏమి చేయలేకపోతున్నాయి. గత ఏడాది కాలంలో ఈ నకిలీ కాల్ సెంటర్లు కస్టమర్లను దోచుకుంటున్నాయి. వేల కోట్ల రూపాయల డబ్బు కొట్టేసిన అయినప్పుడు కూడా ప్రభుత్వ సంస్థలు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.
సైబరాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారంతో ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న నకిలీ కాల్ సెంటర్ ని గుట్టు రట్టు చేశారు. ఈ కాల్ సెంటర్ ఏకంగా ఏడాది కాలంగా నడుస్తుందని అధికారుల విచారణలో బయట పడింది. అంతేకాకుండా ఈ కాల్ సెంటర్ ప్రముఖ కేంద్ర బ్యాంక్ ఎస్బీఐ పేరు పెట్టి నకిలీ కాల్ సెంటర్ ని నడిపిస్తున్నారు. గత ఏడాది కాలం నుంచి 33 వేల పైచిలుకు ఎస్ బి ఐ customers తో మాట్లాడారు. ఈ 33వేల సంబంధించిన ఖాతాదారుల అకౌంట్ల సంబంధించిన డబ్బులు వీళ్ళు కొట్టేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎస్ బి ఐ కాల్ సెంటర్ పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. గత మూడు నెలల కాలంలోనే 24 పైగా ఫోన్ కాల్స్ సంబంధించి ఫిర్యాదులు రావడం జరిగింది. ఇబ్బడిముబ్బడిగా వస్తున్న నకిలీ sbi కాల్స్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీరియస్ గా తీసుకున్నారు. నకిలీ కాల్స్ వ్యవహారాల్ని బట్టబయలు చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులకు కమిషనర్ ఆదేశాలు జారీచేశారు.. ఈ నేపథ్యంలో ఎస్బిఐ కాల్స్ snooping కాల్స్ చేస్తున్న వారిని పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు వెంటపడ్డారు. స్నూపింగ్ కాల్స్ మొత్తం కూడా ఢిల్లీ నుంచి వస్తున్నట్లుగా అధికారులు తెలుసుకున్నారు. ఇందులో భాగంగా వారం రోజుల పాటు ఢిల్లీ నగరంలో సైబర్ క్రైమ్ పోలీసులు మాటు వేశారు. ఢిల్లీ లోని ఉత్తమ నగర్ లో ఈ కాల్ సెంటర్ ఉన్నట్లుగా అధికారులు తెలుసుకున్నారు. ఉత్తమ్ నగర్ లోని ఒక మారుమూల ప్రాంతంలో కాల్ సెంటర్ ని నడుపుతున్నారు. ఈ కాల్ సెంటర్ మీద దాడి చేసి అందర్నీ పట్టుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు . ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో ఈ కార్యాలయం పైన దాడి చేశారు. ఇందులో వందల మందిని పెట్టి.. ఎస్బిఐ కాల్స్ snooping చేస్తున్నట్టుగా బయటపడింది. స్లీపింగ్ కాల్ సెంటర్ దాడి చేసినప్పుడు చాలా విషయాలు అధికారులకు వెలుగులోకి వచ్చాయి.

అయితే ఈ కాల్ సెంటర్లు యువకులే నడుపుతున్నారు. అయితే నిఖిల్ మదన్ డిగ్రీ వరకు చదువుకున్నాడు ఢిల్లీలో ఉద్యోగం కోసం వచ్చాడు ఢిల్లీలో ఎక్కడ కూడా ఉద్యోగం దొరకలేదు టెక్నికల్ గా మంచి సౌండ్ అయిన ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేశాడు అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది క్రితం ఫర్మన్ హుస్సేన్ తో పరిచయం ఏర్పడింది.. ఫర్ మాన్ హుస్సేన్ ఒక సాఫ్ట్ వేర్ టెక్. ఈ హుస్సేన్ ఒక సైబర్ నేరగాడు. అంతేకాకుండా హుస్సేన్ snooping సాఫ్ట్వేర్ తయారు చేయడంలో దిట్ట. అంతేకాకుండా చాలామందికి snooping సాఫ్ట్వేర్ ని సరఫరా చేస్తూ ఉంటాడు. ఈ snooping సాఫ్ట్వేర్ ని నిఖిల్ మదన్ కూడా కొనుగోలు చేశాడు.. ఒక పెద్ద కాల్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా ఎస్.బి.ఐ సంబంధించి కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసినట్లు అయితే ఎవరికి అనుమానం రాదని అనుకున్నాడు. ఇందులో భాగంగా 18601801290 ఎస్ బి ఐ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ ని వీలు snooping చేశారు. టోల్ ఫ్రీ నెంబర్ కి వస్తున్నా కాల్స్ మొత్తం కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా ఈ కాల్ సెంటర్ లో కొంతమంది సిబ్బందిని కూడా నియమించుకున్నారు . మొత్తం గా వస్తున్న కాల్స్ వాటిని సంబంధించిన వారి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇది ఒక వైపు చేస్తూనే మరోవైపు ఎస్ బి ఐ కి సంబంధించిన క్రెడిట్ ,డెబిట్ కార్డు సంబంధించి వ్యక్తిగత వివరాలు అన్నీ కూడా డార్క్ వెబ్ లో కొనేశారు. థర్డ్ పార్టీ వెరిఫికేషన్ దగ్గర డాటా మొత్తాన్ని కొట్టేశారు . ఈ డేటా ఆధారంగా అందులో ఉన్న క్రెడిట్ డెబిట్ కార్డ్ హోల్డర్ కి డైరెక్ట్ గా ఫోన్ చేసేవాళ్ళు. తాము ఎస్బిఐ కాల్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నట్టుగా చెప్పేవారు. మీ కార్డు అప్డేట్ చేస్తాను అని , కొన్ని సార్లు కార్డు కొత్త కార్డు పంపిస్తామని, మరొకసారి మీ కార్డులో క్రెడిట్ లిమిట్ పెంచుతామని, మరొకసారి ఇలా కార్డుల హోల్డర్స్ కి ఫోన్ చేసి చెప్పారు.
అయితే కాల్ సెంటర్ నుంచి ఫోన్ వస్తున్నట్టుగా ట్రూ కాలర్ లో కూడా చూపెట్టేది . దీంతో కస్టమర్లు నమ్మేసి పూర్తి వివరాలు కూడా ఈ నకిలీ కాల్సెంటర్ సిబ్బందికి చెప్పేవారు. ఇదే తరుణంలో కస్టమర్ లకు సంబంధించిన ఓటిపి ని మాటల్లో పెట్టి తెలుసుకునేవారు. దీంతో వెంటనే రెండు ప్రముఖ వెబ్సైట్ల ద్వారా ట్రాన్సాక్షన్ చేసేవారు. నోబ్రోకర్.కామ్, హౌసింగ్ డాట్ కామ్ అనే 2 వెబ్ సైట్ ద్వారా బిజినెస్ లు చేసే వారు. వికాస్ అనే వ్యక్తి ద్వారా మొత్తం 49 డమ్మీ బ్యాంక్ అకౌంట్ను సేకరించారు. కాల్ సెంటర్ సిబ్బంది ఒక్క వైపు మాట్లాడుతూనే otp తెలుసుకొని వెంటేనే మరొక సిబ్బందికి చెప్పిన పక్షంలో 2 వెబ్ సైట్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వెంటనే డమ్మీ అకౌంట్ కు బదిలీ చేసే వారు. ఇలా ఇప్పటి వరకు ఏడాది కాలంలో 33 వేలకు పైగా కాల్స్ చేసినట్లుగా బయటపడింది. దాంతో పాటుగా రెండు వేల పైగా సిమ్ కార్డులలను ఏడాది కాలంలో వాడి పడేశారు. దీంతో ఇప్పటి వరకు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును దోచుకున్నారని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ ముఠా పైన ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఐదు వేల పైచీలుకు కేసులు నమోదు అయి ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఈ ముఠా ని ఎవరు కూడా పట్టుకోలేదు. అయితే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం గత మూడు నెలల కాలం నుంచి మాటువేసి ఈ ముఠాని పట్టుకోవడం జరిగింది. ఇందులో నిఖిల్ తో పాటు 14 మందిని అరెస్టు చేశారు.