NTV Telugu Site icon

తెలంగాణ కరోనా అప్‌డేట్‌.. ఇవాళ ఎన్నికేసులంటే..?

COVID 19

COVID 19

తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య మరింత కిందకు దిగివచ్చింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 58,261 శాంపిల్స్‌ పరీక్షించగా.. 259 మందికి పాజిటివ్‌గా తేలింది.. ఇవాళ మరో వ్యక్తి కోవిడ్‌బారినపడి మృతిచెందగా.. 301 మంది కరోనాబాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,62,785కు చేరగా.. రికవరీ కేసులు 6,53,603కి పెరిగాయి. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో 3,900 మంది ప్రాణాలు వదిలితే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 5,282 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ఇక, తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 72 కేసులు నమోదు అయ్యాయి.