NTV Telugu Site icon

తెలంగాణ కరోనా అప్‌డేట్.. ఇవాళ ఎన్నికేసులంటే..?

covid

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ రోజువారి కేసుల సంఖ్య ఎనిమిది వందలకు చేరువైంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,03,398 సాంపిల్స్‌ పరీక్షించగా.. 808 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఏడుగురు కోవిడ్‌ బాధితులు మృత్యువాతపడ్డారు.. ఇదే సమయంలో 1,061 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,27,498కు చేరగా.. రికవరీ కేసులు 6,12,096గా పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 3,698కి పెరిగింది. తెలంగాణలో రికవరీ రేటు 97.54 శాతంగా ఉందని పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11,704 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 82 కేసులు వెలుగుచూడగా.. నల్గొండలో 62, ఖమ్మంలో 59, కరీంనగర్‌లో 58, మంచిర్యాలలో 51, పెద్దపల్లిలో 50 కేసులు నమోదు అయ్యాయి.