Corona Updates : తెలంగాణలో వెయ్యిదాటిన కరోనా కేసులు.. ఫోర్త్ వేవ్ తప్పదా..
Telangana Corona Bulleting 02.08.2022
యావత్తు ప్రపంచ దేశాలను అతలకుతలం చేస్తున్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఫస్ట్, సెకండ్ వేవల్‌లలో కరోనా సృష్టించి కల్లోలం అంతా ఇంతా కాదు. అయితే థర్డ్ వేవ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. అయితే ఇప్పుడు ఫోర్త్ వేవ్ రూపంలో మళ్లీ కరోనా మహమ్మారి ప్రజలపై విరుచుకుపడేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో సైతం కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయితే తాజాగా.. తెలంగాణలో ఒక్కరోజు వ్యవధిలో కొత్త కేసుల సంఖ్య 1000కి పైన నమోదవం ఆందోళన కలిగించే విషయం. గడిచిన 24 గంటల్లో 44,202 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,054 మందికి పాజిటివ్ గా నిర్ధారణైంది.
అత్యధికంగా హైదరాబాదులో 396 కొత్త కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 60, నల్గొండ జిల్లాలో 49, కరీంనగర్ జిల్లాలో 46 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 795 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 8,21,671 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,11,568 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,992 కొత్త కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: అధికారులతో చర్చిస్తుండగా తీవ్ర అస్వస్థత.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆపరేషన్..
-
AP Weather Alert: ఏపీలో డబుల్ అలర్ట్.. రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు.. ఆ జిల్లాల్లో ఎండలు..
-
RCB vs DC: “చిన్నస్వామిలో ‘కిల్లర్’ షో.. ఆర్సీబీ చేతిలో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్న మిల్లర్.. బెంగళూరుకు షాక్!”
-
CSK Vs SRH: టాస్ గెలిచిన సీఎస్కే.. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. ఇరు జట్లలోకి కొత్త ప్లేయర్లు..
-
Tecno Pop X 5G: టెక్నో పాప్ ఎక్స్ 5జీ రిలీజ్ డేట్ ఫిక్స్.. 6500mAh బ్యాటరీ, మిలిటరీ డ్యూరబిలిటీతో కొత్త గేమ్ చేంజర్!
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!