Site icon NTV Telugu

Congress: నేడు రాజ్‌భవన్‌కు కాంగ్రెస్‌ బృందం.. గవర్నర్‌కు ఫిర్యాదు

Congress

Congress

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రైతు సమస్యలపై గవర్నర్‌ని కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించింది కాంగ్రెస్. ఇవాళ ఉదయం రాజభవన్‌లో గవర్నర్ తమిళ సైతో సమావేశం కానున్నారు. దానికి ముందు… కాంగ్రెస్ నాయకులు సీఎల్పీ వద్ద సమావేశమై గవర్నర్ కార్యాలయానికి బయలుదేరుతారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో 28 మంది సభ్యుల బృందం గవర్నర్ తో భేటీ అవుతారు. రాష్ట్రంలో మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేయాలని కోరనుంది కాంగ్రెస్‌ పార్టీ.

Read Also: Ukraine Russia War: రష్యా బలగాల కీచక పర్వం.. వెలుగులోకి దారుణాలు..

ఇక, హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్మకం పెరిగిపోవడంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరనుంది. హైదరాబాద్ పబ్బుల్లో ఇటీవల దాడి జరిగితే… కొందరిని వదిలేసి… డ్రగ్స్ కేసు తప్పు దోవ పట్టిస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. వరంగల్ ఆసుపత్రిలో ఎలుకల దాడి… వంటి అంశాలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరనుంది. గ్రేటర్ హైదరాబాద్‌పై.. గవర్నర్ కి ఉన్న అధికారాలు ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ సూచనలు చేయాలని భావిస్తోంది. ధాన్యం కొనుగోళ్లపై సీఎం నిర్ణయం తీసుకున్న తరుణంలో.. మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ పెట్టాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. అలాగే చివరి ధాన్యం గింజ కొనేవరకూ.. నిఘా పెడతామని స్పష్టం చేసింది.

Exit mobile version