Site icon NTV Telugu

Congress : నేడు ఢిల్లీకి మంత్రి ఉత్తమ్‌, సీఎం రేవంత్‌

Cm Revanth Reddy

Cm Revanth Reddy

Congress : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి నేరుగా ఢిల్లీ చేరుకుంటారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేపు జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాలో ఆయన పాల్గొననున్నారు.

Mohammed Siraj: ఆ అపోహను సిరాజ్ తొలగించాడు.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ మూడు రోజులపాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇవ్వనున్నారు.

ఈ ధర్నాకు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు జిల్లాల ముఖ్య నాయకులు ఢిల్లీలో ఉన్నారు. అదనంగా, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు కూడా ఈ ఆందోళనలో పాల్గొననున్నారు.

Salman khan : బాలీవుడ్ భాయ్‌ను టేకప్ చేసిన మలయాళ మాస్ మేకర్!

Exit mobile version