Site icon NTV Telugu

CM KCR Suffering From Fever: సీఎం కేసీఆర్‌కు జ్వరం.. మరో నాలుగు రోజులు ఢిల్లీలోనే..!

Cm Kcr

Cm Kcr

టీఆర్ఎస్‌ పార్టీ పేరును బీఆర్‌ఎస్‌ పార్టీగా మార్చుతూ తీర్మానం చేసిన తర్వాత తొలిసారి హస్తినపర్యటనకు వెళ్లిన పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. అక్కడే మకాం వేశారు.. టీఆర్ఎస్‌ను జాతీయస్థాయిలో విస్తరించేందుకు వీలుగా బీఆర్ఎస్‌గా పేరు మార్చిన తర్వాత కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి.. యూపీ మాజీ సీఎం, ఎస్పీ మాజీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లిన కేసీఆర్.. అటు నుంచి నేరుగా హస్తినకు వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీలో బీఆర్ఎస్ కోసం కొత్తగా లీజుకు తీసుకున్న భవనాన్ని పరిశీలించిన ఆయన.. మరమ్మత్తలకు కొన్ని సూచనలు చేశారు.. మరుసటి రోజు వసంత్ విహార్‌లో కొత్తగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయ పనులను పర్యవేక్షించి.. కొన్ని కీలక సూచనలు చేశారు.. అయితే, ఆ తర్వాత ఆయన అధికారిక నివాసానికే పరిమితం అయినట్టు వార్తలు వచ్చాయి.. తీరా విషయం ఏంటంటే.. ఆయన జ్వరంతో బాధపడుతున్నారట.. దీంతో.. మరికొన్ని రోజులు.. హస్తినలోనే మకాం వేయనున్నారని తెలుస్తోంది..

Read Also: CJI Justice DY Chandrachud: సీజేఐగా జస్టిస్‌ చంద్రచూడ్‌.. కేంద్రం ఆమోదం..

అయితే, ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్‌ నుంచి ఉన్నతాధికారులకు పిలుపువచ్చింది.. దీంతో.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హస్తినబాట పట్టారు.. పరిపాలనకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకే ఉన్నతాధికారులను కేసీఆర్‌ ఢిల్లీకి పిలిచినట్టుగా సమాచారం… కాగా, గత వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన తెలంగాణ సీఎం.. మరో నాలుగు రోజులు అక్కడే ఉంటారని చెబుతున్నారు. సీఎంగా కొనసాగుతూనే దేశవ్యాప్తంగా పర్యటిస్తానని.. బీఆర్‌ఎస్‌ విస్తరణ కోసం దేశవ్యాప్తంగా పర్యటనలు, సమావేశాలు, సమాలోచనలు సాగుతూనే ఉంటాయని ప్రకటించిన కేసీఆర్‌.. ఢిల్లీలోనే మకాం వేశారంటే.. ఇంకా ఏదైనా ప్లాన్‌ ఉందా? మేథావులను, సీనియర్‌ పాత్రికేయులను, ఆర్థికవేత్తలను ఇతర పార్టీల కీలక నేతలు, ప్రజాసంఘాల నేతలను, ఉత్తర భారత దేశానికి చెందిన ప్రజాప్రతినిధులను కలుస్తారా? అనేది ఆస్తికరంగా మారింది.

Exit mobile version