KCR: మత పిచ్చితో సమాజానికి నష్టం.. ఆ క్యాన్సర్ మనకొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వనపర్తి బహిరంగ సభా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. దేశంలో గోల్ మాల్ గోవిందం గాళ్లు మోపు అయ్యారని.. దేశాన్ని ఆగం పట్టించే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ప్రజలకు మత పిచ్చి లేపి.. కుల పిచ్చి లేపి.. దుర్మార్గమైన చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.. చైతన్యం ఉన్న గడ్డగా, తెలంగాణ బిడ్డగా నా కంఠంలో ప్రాణం ఉండగా అటువంటి అరాచకాన్ని తెలంగాణలో రానివ్వను అని ప్రకటించిన కేసీఆర్.. మనందరం ఆ పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు.. కులం, మతం, జాతి లేకుండా ప్రజలంతా బాగుపడాలని ఆకాక్షించారు.
Read Also: RK Roja: వాళ్లేంటి? 23 మంది రాజీనామా చేసి గెలిస్తే.. నేనే పోటీ చేయను..
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ఎన్నో అవమానాలు, అవహేళనలను తట్టుకొని రాష్ట్రం సాధించుకున్నాం.. రాష్ట్రం సాధించుకున్న ప్రతిఫలం కళ్లముందు కనిపిస్తుందన్నారు కేసీఆర్.. ఒకప్పుడు ఒక మెడికల్ కళాశాల కూడా లేదు. ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కళాశాల సాధించుకున్నాం.. హైదరాబాద్ నుండి గద్వాల.. వరకు ఎక్కడ చూసినా పచ్చదనం ఉందన్నారు.. పాలమూరు జిల్లా పాలుగారుతోంది.. పాలమూరు పూర్తి చేస్తే అద్భుతమైన వజ్రపు తునక అవుతుందన్నారు.. 15 లక్షల మంది వలస పోయే వారు.. ఇప్పుడు రాయచూరు, కర్నూలు నుండి వలస వస్తున్నారన్న ఆయన.. 11 జిల్లాల నుండి మన వలస కూలీలు మన సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చారని తెలిపారు.. నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరుపెట్టాను.. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇచ్చానన్న ఆయన.. ఈసారి నిరంజన్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.. ఇక, ఈ సందర్భంగా పాలమూరు సాధించిన ప్రగతిపై పాట పాడారు సీఎం కేసీఆర్.. పట్టుబడితే, జట్టు గడితే బంగారు తెలంగాణ సాధ్యమైంది.. దేశం కూడా ఇట్ల అభివృద్ధి కావాలన్నారు.. ఇక, ప్రజలకు మత పిచ్చి లేపుతున్నారు.. అలాంటి వారికి బుద్ధి చెప్పాలన్న కేసీఆర్.. దేశం కోసం పోరాటానికి పోదామా అంటూ కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మంచిని పెంచేందుకు ముందుకు పోయేందుకు నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను.. మత పిచ్చి, కుల పిచ్చి వల్ల సమాజానికి నష్టం అని.. ఈ దేశంలో మంచిని కాపాడటానికి.. మంచిని పెంచడానికి అవసరమైతే నా ప్రాణాన్ని కూడా ధారపోయడానికి సిద్ధంగా ఉన్నా. అదే పద్ధతిలో ముందుకు వెళ్లాలని.. బుద్ధి తక్కువ పార్టీలు, వెదవలు.. వాళ్ల చిల్లర రాజకీయాల కోసం దేశాన్నే, భారత జాతినే బలి పెట్టేటువంటి విష ప్రయత్నాలు జరుగుతున్నాయి. చైతన్యవంతమైన తెలంగాణ మేధావులు.. దయచేసి దాన్ని తిప్పి కొట్టాలి. భయంకరమైనటువంటి ఆ వ్యాధి ఆ క్యాన్సర్ మనకు రాకుండా చూసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!