CM KCR Press Meet: కాసేపట్లో కేసీఆర్ ప్రెస్ మీట్.. విషయం ఇదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు.. రాత్రి 8 గంటలకు కేసీఆర్ ప్రెస్‌మీట్ ఉందంటూ.. మీడియాకు సమాచారం ఇచ్చారు.. అయితే, కేసీఆర్ ఏ అంశాలపై మాట్లాడనున్నారు? అనేది మాత్రం ఉత్కంఠగా మారింది… తెలంగాణ రాజకీయాల్లో కాకరేపిన మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది.. దీంతో, మునుగోడుపై గులాబీ బాస్ స్పందిస్తారనే ప్రచారం సాగుతోంది.. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం, పోలింగ్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విక్టరీ కొడతారన్న పక్కా సర్వే రిపోర్ట్ కూడా ఉందట.. దీంతో.. మునుగోడు ఉప ఎన్నికపై కేసీఆర్ స్పందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read
- Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్
- Demonetisation Fraud Case: పాత నోట్ల మార్పిడి కేసులో సంచలన తీర్పు.!
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి FIRలో సంచలన విషయాలు..
మరోవైపు.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. ఈ వ్యవహారంలో మరిన్ని ఆధారాలను కేసీఆర్ బయటపెడతారా? వీడియోలు చూపిస్తారా? అనే చర్చ సాగుతోంది.. అయితే, ఇప్పటికే మునుగోడు వేదికగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించిన కేసీఆర్.. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున.. పూర్తిస్థాయిలో స్పందించలేనన్న విషయం విదితమే.. అవసరం అయినప్పుడు అన్నీ బయటపెడతాం.. దొంగలు అడ్డంగా దొరికిపోయారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.. మరోవైపు.. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడమే లక్ష్యంగా టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మారుస్తూ తీర్మానం చేశారు కేసీఆర్.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా రావడంతో.. బీఆర్‌ఎస్ యాక్షన్ ప్లాన్‌ను కూడా వివరిస్తారనే చర్చ సాగుతోంది.. మొత్తంగా మాత్రం మునుగోడులో విక్టరీ కొడతామన్న నమ్మకంతో ఉంది టీఆర్ఎస్.. ఈ ప్రెస్‌మీట్ కూడా మునుగోడు చుట్టే తిరిగే అవకాశం ఉందని.. మునుగోడు ఓటర్లకు కేసీఆర్ ధన్యవాదాలు తెలుపుతారని తెలుస్తోంది. ఏమైనా.. కేసీఆర్ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ నెలకొంది..
తాజావార్తలు
-
Trump-Iran: జోర్డాన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
-
Rahul Gandhi: అమిత్ షాను వెంటనే తొలగించండి.. ప్రధానికి రాహుల్ సలహా..
-
AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్.. ఈసారి 10,660 ఉద్యోగాలు భర్తీ.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
-
Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
-
Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!