Munugode Bypoll: మునుగోడుపై సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. రేపు అభ్యర్థి అధికారికంగా ప్రకటించే అవకాశం వున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లను టీఆర్ఎస్ అభ్యర్థిగా మునుగోడులో ప్రకటించే అవకాశం వున్నట్లు తెలుస్తుంది. ఎల్లుండి నుంచి మునుగోడులో స్థానికంగా నేతలు ప్రచారానికి భారీ ఏర్పాట్లపై కసరత్తు కొనసాగుతుంది.
దసరా సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన జాతీయ కార్యవర్గ వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. అలాగే దసరా (అక్టోబర్ 5) ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో యథావిధిగా టీఆర్‌ఎస్ జనరల్ బాడీ సమావేశం ఉంటుందని కేసీఆర్ నిన్న సోమవారం స్పష్టం చేశారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ దసరా సందర్భంగా నిర్వహించే సర్వసభ్య సమావేశాన్ని ప్రభావితం చేయదని, సభ్యులు గందరగోళం చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. దసరా సందర్భంగా సీఎం కేసీఆర్ తన జాతీయ పార్టీ పేరును ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ భేటీ తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాల పట్ల తన వైఖరిని వెల్లడించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే పార్టీ పేరు మార్చేందుకు టీఆర్ఎస్ పార్టీ నేతల బృందం ఢిల్లీకి వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అక్టోబర్ 9న ఢిల్లీలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగిస్తారని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఎన్డీయే పాలనలో అన్ని అంశాల్లో విఫలమైనందున దేశ ప్రజలు బలమైన జాతీయ వేదిక కోసం చూస్తున్నారని టీఆర్‌ఎస్ నేత శ్రీధర్ రెడ్డి అన్నారు. జాతీయ పార్టీ పేరును సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని వేచి ఉండండి’’ అని టీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. కాగా, తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుగౌడ్ యాష్కీ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ సీఎం జాతీయ పార్టీ పెట్టడం అర్థరహితమైన ఎత్తుగడ అని, తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇప్పుడు దేశ ప్రజలను మోసం చేయాలన్నారు. ఇది అతని వైఫల్యాలను కప్పిపుచ్చడం, అతని కుటుంబ సభ్యుల ఢిల్లీ మద్యం కుంభకోణం నుండి డబ్బును మళ్లించే వ్యూహం మాత్రమే. బీజేపీ ప్రయోజనాల కోసం కేసీఆర్ ప్రతిపక్షాలను విభజించాలని చూస్తున్నారని మండిపడ్డారు.
Read also: Sharan Navaratri 2022: కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి నదీ విహారానికి బ్రేక్
కాగా.. BRS పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ఇతర పార్టీల నేతలూ హాజరుకానున్నారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి సహా ఇతర పార్టీల నేతలు వస్తారని TRS వర్గాలు చెబుతున్నాయి. UPలోని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ హాజరుకావాల్సి ఉన్నా.. ఆయన తండ్రి అనారోగ్యం కారణంగా రావడం లేదు. అటు TRS పేరును BRSగా మార్చేందుకు అనుకూలంగా తీర్మానం చేసేందుకు 283 మంది TRS ప్రతినిధులు ఈ రాత్రికే హైదరాబాద్ చేరుకుంటారు.
Amit Shah: జమ్మూకాశ్మీర్ పర్యటనలో అమిత్ షా.. జమ్మూ, రాజౌరిలో నిలిచిన మొబైల్ ఇంటర్నెట్ సేవలు
