నీటివాటాను వదులుకోం.. కేంద్రాన్ని నిలదీయండి-కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కేంద్రం గెజిట్లు విడుదల చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. ఇక, త్వరలోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. నీటా వాటాల విషయంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్.. సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వకూడదని ఎంపీలకు స్పష్టం చేశారు కేసీఆర్. లోక్ సభ, రాజ్యసభల్లో, సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటివాటాకోసం కేంద్రాన్ని నిలదీయాలని, గట్టిగా కొట్లాడాలని సూచించారు. విభజన సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా, ఇంకా రాష్ట్రానికి సంబంధించిన పెండింగు సమస్యల పరిష్కారం కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలని తెలిపారు. సంబంధిత కేంద్ర మంత్రులను కలుస్తూ వినతిపత్రాలను అందచేయాలని ఎంపీలకు సూచించారు తెలంగాణ సీఎం.
రాష్ట్రానికి సంబంధించిన సివిల్ సప్లైస్ శాఖ సమస్యలు పెండింగులో ఉన్నాయని, వాటిని పరిష్కరించుకునే దిశగా సంబంధిత మంత్రిని కలువాలని పార్టీ పార్లమెంట్ సభ్యులను ఆదేశించారు సీఎం కేసీఆర్.. కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం ప్రగతి భవన్ లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో ప్రస్తావించాల్సిన తెలంగాణ అంశాలు, సమస్యలపై సిఎం కెసిఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో.. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్., టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీనేత కె.కేశవరావు, లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర్ రావు, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, జోగినపల్లి సంతోష్ కుమార్, కె ఆర్ సురేశ్ రెడ్డి, బండా ప్రకాశ్, బడుగుల లింగయ్య యాదవ్, లోక్ సభ సభ్యులు బి.బి పాటిల్, పోతుగంటి రాములు, కొత్త ప్రభాకర్ రెడ్డి, గడ్డం రంజిత్ రెడ్డి, పసునూరి దయాకర్, బి.వెంకటేశ్ నేత, మన్నె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read
- Telangana Heatwave Alert: తెలంగాణకు హీట్ వేవ్ అలర్ట్.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ!
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Bandi Bhageerath: బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం.. మరో సిట్ ఏర్పాటు!
తాజావార్తలు
-
Mohammad Rizwan – Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ – బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్‌కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!