Site icon NTV Telugu

CM KCR: రైతులకు అండగా వుంటాం.. మోడీ ఆటలు సాగనివ్వం

Kcr Punjab

Kcr Punjab

కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ తీరుపై మండిపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. స్నేహపూర్వకంగా వుండే రాష్ట్ర ప్రభుత్వాలంటే కేంద్రంలోని మోడీ ప్రభుత్వాలను అస్సలు పట్టించుకోరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. రైతుల కోసం ఏం చేసినా కేంద్రానికి నచ్చదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ‘రైతు పోరాటానికి మా మద్దతు ఉంటుంది. తెలంగాణ ఏర్పడక ముందు కరెంట్ కోతలు తీవ్రంగా ఉండేవి. రోజుకు 10మంది రైతులు చనిపోయేవారు. వ్యవసాయంపై ఇప్పటికీ కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తోంది. నా ప్రాణం పోయినా మీటర్లు పెట్టనని చెప్పా’ అని తెలిపారు. ఈ సందర్భంగా రైతు కుటుంబాలకు కేసీఆర్ చెక్కులు అందజేశారు.

రైతులను ఏదో విధంగా ఇబ్బందుల‌కు గురిచేయాల‌ని చూస్తుంద‌ని విమ‌ర్శించారు. కేంద్రం అనుస‌రిస్తున్న రైతు విధానాల‌కు వ్యతిరేకంగా దేశంలోని రైతులంద‌రూ ఏక‌తాటిపైకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం కేసీఆర్ నొక్కి చెప్పారు. ప్రభుత్వాల‌ను మార్చే శ‌క్తి రైతుల‌కు ఉంద‌ని వారికి ధైర్యం క‌లిపించారు. తాము ఒంట‌ర‌య్యామ‌ని రైతు కుటుంబాలు ఆందోళ‌న చెంద‌వ‌ద్దని, తామంతా అండ‌గా వున్నామ‌ని కేసీఆర్ పూర్తి భ‌రోసానిచ్చారు.

పంజాబ్ పర్యటనలో కేసీఆర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు పాల్గొన్నారు. . చండీగ‌ఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు ఉద్యమంలో మ‌ర‌ణించిన రైతు కుటుంబాల‌ను, గాల్వాన్ స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ‌ల్లో అమ‌రులైన సైనిక కుటుంబాల‌ను సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా 600 కుటుంబాల‌కు 3 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక స‌హాయం అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. అంతకుముందు ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్‌ తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు కేసీఆర్. పలు అంశాలు వీరిమధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

Nara Lokesh: దేశంలోనే అత్యధికంగా ఏపీలో ‘వ్యాట్’ బాదుడే బాదుడు

Exit mobile version