Site icon NTV Telugu

1.30 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం.. 50 వేల ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ-కేసీఆర్

CM KCR

CM KCR

టీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగంలో ఇప్పటికే లక్షా ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు సీఎం కేసీఆర్… నూతన జోన్ల ఆమోదం తర్వాత జోన్లలో క్లారిటీ రావడంతో మరో 50 వేల ఉద్యోగాలకోసం కార్యాచరణ రూపొందించామన్నారు.. భవిష్యత్తులో జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగ నియామకాలు ఉంటాయని తెలిపారు. ఇక, అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలితాలను తెలంగాణ ప్రజలు దక్కించుకోవడం ఇప్పటికే ప్రారంభమైందన్న ముఖ్యమంత్రి… దండుగన్న వ్యవసాయం నేడు పండుగలా మారడమే అందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు.. వ్యవసాయ రంగం నేటి యువతను కూడా ఆకర్షిస్తుండడం వెనక తెలంగాణ ప్రభుత్వ శ్రమ ఎంతోమందని గుర్తుచేసుకున్న ఆయన.. పారిశ్రామిక, వాణిజ్యం, ఐటి రంగాలు సహా వ్యవసాయం దాని అనుబంధ రంగాలు అభివృద్ధి పథంలో ఉన్నాయని వెల్లడించారు. లక్షలాదిగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామని.. కాలమాన పరిస్థితుల్లో యువత మరింత సమర్థవంతంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు.. ఐటి సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు లభించే దిశగా తెలంగాణ నైపుణ్య పరిజ్జాన అకాడమీ (టాస్క్)ని దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు సీఎం కేసీఆర్.

Exit mobile version