Telangana Cabinet : హైదరాబాద్‌లో సోమవారం ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 25 అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రవాణా, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి విభాగాలకు సంబంధించిన పలు ప్రతిపాదనలు ఆమోదం పొందాయి.
రవాణా శాఖకు సంబంధించిన ముఖ్య నిర్ణయంగా, రాష్ట్ర సరిహద్దుల్లో ప్రస్తుతం ఉన్న అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను రద్దు చేయాలని కేబినెట్ తేల్చింది. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల్లో మొత్తం 15 చెక్ పోస్టులు ఉన్నాయి. జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా అన్ని రాష్ట్రాలకు చెక్ పోస్టులను తొలగించాలన్న సూచనలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా చెక్ పోస్టులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై వాహనాలను పరిశీలించేందుకు చెక్ పోస్టు సిబ్బందిని ఉంచడం కాకుండా, ఆధునిక ‘వాహన్’ సాఫ్ట్‌వేర్, అడ్వాన్స్డ్ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ కొనసాగించనుంది.
Trump: ట్రంప్ నోట మళ్లీ అదే మాట.. నేను అడ్డుకోకపోతే భారత్-పాక్ యుద్ధంలో ఉండేవి
అదేవిధంగా, రాష్ట్ర పట్టణాభివృద్ధి రంగానికి సంబంధించిన ముఖ్య నిర్ణయం తీసుకుంది. కోర్ తెలంగాణ అర్బన్ సిటీ ఏరియాతో పాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో మైక్రో బ్రూవరీస్ చట్టంలో అవసరమైన సవరణలు చేసి త్వరలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
కేబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాలు రాష్ట్ర రవాణా రంగంలో సులభతరం , ఆధునీకరణ దిశగా ముందడుగుగా భావించబడుతున్నాయి. అదే సమయంలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటుతో పట్టణాలలో వినోదం, పర్యాటక రంగాలకు కొత్త ఉత్సాహం కలిగే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Mahadev Operation: ఉగ్రవాదుల్ని సైన్యం ఎలా మట్టుబెట్టింది.. మహదేవ్ ఆపరేషన్ సీక్రెట్ ఇదే!
