Site icon NTV Telugu

BJP: పాలమూరులో బీజేపీ కీలక నేతల భేటీ

Jp Nadda

Jp Nadda

తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.. అధిష్టానం నుంచి తరచూ రాష్ట్రంలో పర్యటనలు కొనసాగిస్తున్నారు నేతలు.. ఇక, ఇవాళ పాలమూరులో బీజేపీ రాష్ట్ర పదాధికారులు, ముఖ్య నేతలు సమావేశం అయ్యారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రాజాసింగ్, రఘునందన్ రావు హాజరయ్యారు.

Read Also: Mahesh Babu: మహేష్ బాబు అందం వెనుక సీక్రెట్ అదేనంట..

ప్రధానంగా ఈ సమావేశంలో అమృత్ మహోత్సవ్, మన్ కీ బాత్, ప్రతి ఇంటిపై జాతీయ జెండా కార్యక్రమాలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది.. పార్టీ కార్యకర్తల శిక్షణా కార్యక్రమాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, బీజేపీలో పలువురు తెలంగాణ నేతలు చేరతారనే ప్రచారం సాగింది.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. బుధవారం రోజు పాదయాత్రలో ఉన్న బండి సంజయ్‌ని కలిసి చర్చలు జరపడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. త్వరలోనే ఆయన బీజేపీలో చేరతారు అనే ప్రచారం సాగుతోంది. జేపీ నడ్డా పర్యటనకు ఒక్కరోజు ముందే.. రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ఏం చర్చించారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version