NTV Telugu Site icon

Bandi Sanjay: అర్థరాత్రి కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం ఏంటి

Bandi 3

Bandi 3

బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల బండి సంజయ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఘట్ కేసర్ టోల్ గేట్ సమీపంలో జిట్టాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్న సంజయ్.. జూన్ 2న ‘‘అమరుల యాదిలో.. ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’’ను జిట్టా నిర్వహించారని తెలిపారు. కేసీఆర్ ను కించపరిచే విధంగా ఆ సభలో స్కిట్ వేయించారని టీఆర్ఎస్ నేతల ఫిర్యాదుపై జిట్టాను పోలీసులు అరెస్ట్ చేశారు.

జిట్టాను పోలీసులు అర్దరాత్రి అదుపులోకి తీసుకోవడంపై సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులివ్వకుండా అర్ధరాత్రి కిడ్నాప్ చేసి తీసుకెళ్లడమేంటని పోలీసుల తీరుపట్ల ఆయన మండిపడ్డారు. జిట్టాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిట్టాకు ఏం జరిగినా కేసీఆర్ సర్కారు, పోలీసులదే పూర్తి బాధ్యత అని సంజయ్ హెచ్చరించారు.

బీజేపీ నేత బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రూ.7500 కోట్ల రైతు బంధు నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ ఆయన కేసీఆర్‌కు లేఖ రాశారు.

రైతుల సమస్యలను గాలికొదిలేసిన కేసీఆర్.. దేశవ్యాప్తంగా వ్యక్తిగత ప్రచారానికి, మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటనకు ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Breaking: బండి సంజ‌య్ హౌజ్ అరెస్ట్‌