Site icon NTV Telugu

BJP National Executive Meeting: మోదీ సభకు భారీ ఏర్పాట్లు.. 25 రైళ్లలో 50 వేల మంది

Bjp Modi

Bjp Modi

ప్ర‌ధాని మోదీ జూలై 2, 3 తేదీల్లో హైద‌రాబాద్ కు రానున్న నేప‌థ్యంలో.. మాదాపూర్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో బసకు ఏర్పాటు చేసారు అధికారులు. అయితే.. రాజ్‌భవన్‌లోనే మోడీ బస చేస్తారని తొలుత భావించారు. కాగా.. రాజ్‌భవన్‌ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెచ్‌ఐసీసీ వరకు ప్రధాని రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు సమస్యగా మారుతాయని నిఘా వర్గాలు తెలిపారు. దీంతో.. ఎస్పీజీ సూచన మేరకు నోవాటెల్‌లోనే ప్రధాని బసను ఖరారు చేసిన విషయం తెలిసిందే..

ఈ నేప‌థ్యంలో సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున అభిమానులను సభకు తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో రైలు నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న నియోజకవర్గాల నుంచి, సుమారు 25 రైళ్లలో 50 వేల మందిని సభకు తర లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సంద‌ర్భంగా.. బీజేపీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ ఈ వివరాలు వెల్లడిం చారు. ప‌లు జిల్లాల నుంచి వచ్చేవారు శివార్లలో వాహనాలు పార్క్‌ చేసి.. మెట్రో రైళ్లలో సభాస్థలికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని, మోదీ సభకు తరలిరావాలని కోరుతూ సుమారు 10 లక్షల ఆహ్వాన పత్రికలను రాష్ట్రవ్యాప్తంగా బూత్‌ స్థాయిలో పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించాయి. అంతేకాకుండా.. వర్షం వచ్చినా ఆటంకం లేకుండా, ప్రధాని బహిరంగసభలో వర్షం కురిసినా జనానికి ఇబ్బంది లేకుండా అధునాతన టెక్నాలజీతో కూడిన జర్మన్‌ హ్యాంగర్‌ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు.

BJP National Executive Meeting: బీజేపీ టార్గెట్‌ అదే.. అందుకే హైదరాబాద్‌ వేదికగా సమావేశాలు..!

Exit mobile version