Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
- 75 సమస్యాత్మక గ్రామాల్లో సమగ్ర భూ సర్వేకు శ్రీకారం
- ధరణి స్థానంలో భూ భారతి.. పారదర్శకతకు పెద్దపీట
- సర్వే పూర్తయ్యాక భూ యజమానులకు భూదార్ నంబర్
- రైతుల భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ పనితీరుపై సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మండల స్థాయి అధికారుల నుంచి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు ఉన్నతాధికారులతో కలిసి దాదాపు 5 గంటల పాటు ఆయన సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో ఏళ్లతో పాటు పేరుకుపోయిన భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను క్షేత్రస్థాయి నుంచి పరిశీలించి వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ధరణి స్థానంలో ‘భూ భారతి’.. 75 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే
గత ప్రభుత్వంలో అనేక లోపాలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ధరణి పోర్టల్ స్థానంలో, ప్రజల సౌకర్యార్థం అత్యంత పారదర్శకమైన ‘భూ భారతి’ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి పొంగులేటి తెలిపారు. భూ వివాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టాలంటే సమగ్ర భూ సర్వే ఒక్కటే సరైన మార్గమని ఆయన ఉద్ఘాటించారు. అందులో భాగంగానే మొదటి దశ కింద రాష్ట్రవ్యాప్తంగా అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 75 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి సర్వే ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ డిజిటల్ భూ సర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతి భూ యజమానికి ఆధార్ తరహాలో ప్రత్యేకమైన “భూదార్ నంబర్” కేటాయించనున్నట్లు ప్రకటించారు.
Also Read
ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.. నిరంతరాయంగా ఇందిరమ్మ ఇళ్లు
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ సర్వేపై ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, తమ గ్రామాల్లో కూడా తక్షణమే సర్వే నిర్వహించాలంటూ వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం చేపడుతున్న రెవెన్యూ సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!