BC Reservations : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించే జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును హైకోర్టు నిలిపివేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల ప్రక్రియను కొనసాగించమని సుప్రీంకోర్టులో వాదించనుంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనందున, హైకోర్టు జోక్యం సరిగ్గా లేదని, GO 9 అమలు చేయాలని ప్రభుత్వం సూచన చేస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్లే వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ నేతలు జూమ్ సమావేశం నిర్వహించి, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో చర్చలు జరిపారు.
Sergio Gor: మోడీతో భేటీ అయిన అమెరికా రాయబారి సెర్గియో గోర్..
