BC Reservation: తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో నెంబర్ 9ని విడుదల చేసింది. ఇది గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీల సమాన ప్రాతినిధ్యాన్ని లక్ష్యంగా పెట్టి తీసుకున్న కీలక నిర్ణయం. ప్రభుత్వం తెలిపిన ప్రకారం, ఈ నిర్ణయం సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ సర్వే ఆధారంగా తీసుకున్నది. బీసీల వెనుకబాటుతనంపై కమిషన్ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకొని, సమాన అభివృద్ధి, సమగ్ర వృద్ధి, సమాన అవకాశాలను అందించే విధంగా రిజర్వేషన్ విధానం రూపొందించబడింది.
Saipallavi : బికినీ ఫొటోలపై స్పందించిన సాయిపల్లవి.. ఏమన్నదంటే..?
ఈ జీవో డైరెక్టివ్ ప్రిన్సిపిల్స్, ఆర్టికల్స్ 40, 243D, 243T ప్రకారం తీసుకోబడింది. అలాగే, “ది తెలంగాణా బీసీ రిజర్వేషన్స్ బిల్, 2025” కూడా ఈ విధానానికి మద్దతుగా ఆమోదం పొందింది. జూలై 11న ప్రభుత్వం విడుదల చేసిన అదనపు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్, ఆగస్టు 28న సమర్పించబడిన కమిషన్ నివేదిక ఆధారంగా, బీసీలకు స్థానిక సంస్థల్లో సమాజిక న్యాయం , రాజకీయ సాధికారతను కల్పించే విధంగా రిజర్వేషన్లు అమలు చేయబడుతున్నాయి. తెలంగాణ ఈ నిర్ణయంతో పల్లె–పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రంగా మారింది.
Khalistani terrorist: “ఢిల్లీ ఖలిస్తాన్ అవుతుంది”.. అజిత్ దోవల్‌కు టెర్రరిస్టు బెదిరింపులు..