Saipallavi : సాయిపల్లవికి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉండటానికి కారణం.. ఆమె పద్ధతి. ఎక్కడికి వెళ్లినా పద్ధతి గల బట్టలు వేసుకుంటుందని, ఈవెంట్లలో, సినిమాల్లో ఎలాంటి గ్లామర్ షో చేయదు అనే. అలాంటిది మొన్న సోషల్ మీడియాను ఆమె బికినీ ఫొటోలు ఊపేశాయి. అవి నిజమో కాదో అసలే తెలియదు. ఎందుకంటే అవి అఫీషియల్ గా సాయిపల్లవి ఐడీ నుంచి వచ్చినవి కాదు. కొందరేమో నిజమే అంటూ ఆమెను విమర్శించారు. కానీ మెజార్టీ అభిమానులు అవి నిజం కాదని కొట్టి పారేశారు. కొన్ని సాక్ష్యాలను చూపిస్తూ అవి ఫేక్ అని పోస్టులు పెట్టారు. అయితే ఈ రచ్చపై తాజాగా సాయిపల్లవి చేసిన పోస్టులో క్లారిటీ వచ్చేసింది.
Read Also : OG : ఓజీ2 కాకుండా సుజీత్ తో పవన్ కల్యాణ్ మరో సినిమా..?
తాజాగా ఆమె ఓ ట్రిప్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దానికి ఆమె.. ‘పైన కనిపిస్తున్న ఫొటోలు ఏఐ కాదు.. నిజమైనవే’ అంటూ ఇన్ డైరెక్ట్ గా స్పందించింది. అంటే బికినీ ఫొటోలు ఏఐ ఫొటోలు అని తేల్చి పడేసిందన్నమాట. అందుకే ప్రత్యేకంగా ఏఐ ఫొటోల గురించి ఆమె కామెంట్ చేసింది. ఈ పోస్టు కింద వేలాది మంది ఆమెకు మద్దుతుగా కామెంట్లు పెడుతున్నారు. మేమంతా నీ వెంటే ఉన్నాం.. అవన్నీ మేం నమ్మలేదు అంటూ స్పందిస్తున్నారు. మొత్తానికి సాయిపల్లవి ఇన్ డైరెక్ట్ గా అయినా.. ఈ రచ్చపై క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం సాయిపల్లవి భారీ పాన్ ఇండియా మూవీ రామాయణ్ లో నటిస్తోంది.
Read Also : Siddhu Jonnalagadda : అప్పు చేసి రూ.4.75 కోట్లు ఇచ్చా.. సిద్దు జొన్నలగడ్డ కామెంట్స్