Cough Syrups : చిన్నారులలో తీవ్రమైన రోగాల్ని, మరణాలను కలిగిస్తున్న ప్రమాదకర దగ్గు మందులను రాష్ట్ర ప్రభుత్వం నిషేధిస్తూ చర్య తీసుకుంది. రీలైఫ్, రెస్పీఫ్రెష్-టీఆర్ అనే రెండు సిరప్‌లను విక్రయించరాదు అని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం పిల్లల భద్రతను ముఖ్యంగా పరిగణించి తీసుకోవడం విశేషం. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కోల్డ్‌రిఫ్ సిరప్ కారణంగా 16 చిన్నారుల మరణాలు చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Karur Stampede: సుప్రీంకోర్టుకు విజయ్.. కరూర్ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని వినతి
డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా ఎడపెడా పిల్లలకు దగ్గు, జలుబు సిరప్‌లు ఇవ్వకూడదని అధికారిక సూచనలు కూడా జారీ అయ్యాయి. కాంచీపురంలోని Sresan Pharmaceuticals తయారు చేసిన కోల్డ్‌రిఫ్ సిరప్‌పై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తనిఖీలు నిర్వహించింది. ఈ సిరప్‌ను తక్షణం తెలంగాణలో విక్రయించరాదు అని ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని హాస్పిటళ్లు, ఫార్మసీలు ఈ నిషేధాన్ని వెంటనే అమలు చేయాల్సినట్లు సూచించబడింది.
IMC 2025: ఆసియాలోనే అతిపెద్ద టెలికాం ఈవెంట్.. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించిన పీఎం మోడీ