అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ కేంద్రం పై ఫైర్ అయ్యారు. మొదటి సారి మోడీ నీ వ్యతిరేకించింది నేనే.. ఎక్కడైన చర్చకు రెడీ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కరెంట్ కష్టాలు చూశామన్నారు. అందరం ఇబ్బంది పడ్డాం అన్నారు. ఇది మహాత్మగాంధీ పుట్టిన నేలనేనా? అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం మొదటి క్యాబినెట్ లోనే తెలంగాణ గొంతు నొక్కిందని మండిపడ్డారు. మన మండలాలు.. సీలేరు ప్రాజెక్టు గుంజుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోనియా గాంధీ తెలంగాణ బిల్లు ఫైనల్ స్టేజ్ కి వచ్చే సరికి తెలంగాణకు కేటాయింపులో సీలేరు ఇచ్చారు మనకని గుర్తు చేశారు. సింగరేణి కూడా మనకే కేటాయించిందని అన్నారు. మోడీ.. మోస్ట్ ఫాసిస్ట్ ప్రధాని అని మండిపడ్డారు. మొదటి సారి మోడీ నీ వ్యతిరేకించింది నేనే.. తెలంగాణ బంద్ కి పిలుపు నిచ్చింది నేనే అని సీఎం కేసీఆర్ అన్నారు.
-
కేంద్ర ప్రభుత్వం FRBM రూల్స్ పై కోర్టుకు పోతాం- కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం FRBM రూల్స్ పై కోర్టుకు పోతామన్నారు కేసీఆర్. రేపు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఆర్థిక మంత్రి అసెంబ్లీలో చెబుతారన్నారు. ఇష్టం లేకున్న పీయూష్ గోయల్ వెంట పడితే కేంద్ర ప్రభుత్వ ఉదయ్ స్కిం లో చేరామన్నారు. పెన్షన్లు, రైతు బంధు ఎందుకు ఇస్తారు అని రాష్ట్ర మంత్రులతో పీయూష్ గోయల్ అంటారు. విశ్వ గురువు పెట్టె ప్రసాదం ఏంటో ఒక్క గంటలో చెప్పాలేమన్నారు. శ్రీలంకలో మోడీ కి వ్యతిరేకంగా ఆ దేశంలో ఆందోళనలు జరిగాయని సీఎం గుర్తు చేశారు.
-
జాతీయ పార్టీ మేము పెట్టకపోతే మీరు పెడతారా ? -కేసీఆర్
రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య గోడలు కట్టరు కదా ? అని ప్రశ్నించారు. తెలంగాణ లో ఉన్నాయి.. మహారాష్ట్ర , కర్ణాటక లో ఇవ్వడం లేదన్నారు. ఠేకేదార్ లా మాట్లాడ్తున్నారు ...జాతీయ పార్టీ పెడతారా అంటరు. జాతీయ పార్టీ మేము పెట్టకపోతే మీరు పెడతారా ? అంటూ ప్రశ్నించారు. జాతీయ లక్షణము ఎవరికి ఉన్నది ? అంటూ ప్రశ్నించారు. ఈ దేశ కేంద్ర ప్రభుత్వంను నేను విమర్శించడము నా బ్యాడ్ లక్ అనుకుంటున్నా అన్నారు సీఎం.
-
పోరాటాల గడ్డ తెలంగాణ.. పౌరుషం ఉండే గడ్డ తెలంగాణ- సీఎం కేసీఆర్
మేం ఎందుకు జాతీయ పార్టీ పెట్టకూడదు. పోరాటాల గడ్డ తెలంగాణ పౌరుషం ఉండే గడ్డ తెలంగాణ. విద్యుత్ సంస్కరణలు ఉపసంహరించుకోవాలని చేతులు జోడించి అడుగుతున్నాం. బీజేపీ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఈ ప్రభుత్వ కాలం ఇంకా 18 నెలలే అని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో 15 కోట్ల రైతు కుటుంబాలు ఉన్నాయి. రైతులందరిని ఏకం చేసి బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపుదామన్నారు సీఎం కేసీఆర్.
-
త్వరలో శీతాకాల సమావేశాలు - సీఎం కేసీఆర్
విద్యుత్ బిల్లు అడ్డుకునేందుకు ఎక్కడిదాకైనా పోరాడుతాం. త్వరలో శీతాకాల సమావేశాలను పెడదాం అన్నారు సీఎం. 20 రోజుల పాటు సభ నడుపుకుందాం అన్నారు.
-
ఉద్యోగులంటా సింహాల్లా పోరాడాలి- సీఎం కేసీఆర్
గాంధీ, బుద్ధుడు పుట్టిన దేశంలో ఏం జరుగుతోంది. రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోస్తున్నారు. ఈసంస్కరణలతో విద్యుత్ సిబ్బంది ఉద్యోగాలన్నీ పోతాయి. 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారు. అందుకే ఉద్యోగులంతా సింహాల్లా పోరాడాలని సీఎం కేసీఆర్ పిలుపు నిచ్చారు. ఈప్రభుత్వ కాలం ఇంకా 18 నెలలే అని సీఎం అన్నారు.
-
విదేశీ బొగ్గు కొనకపోతే విద్యుత్ ఆపేస్తామంటున్నారు - సీఎం కేసీఆర్
సింగరేణిలో బొగ్గుటన్ను 4వేలకు దొరుకుతుంటే.. 10 శాతం విదేశీబొగ్గు విధిగా కొనాలంటున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్. 4వేలకు దొరికే బొగ్గును 30 వేలు పెట్టి కొనాలంటున్నారు. విదేశీ బొగ్గు కొనకపోతే ఎన్టీపీసీ నుంచి విద్యుత్ ఆపేస్తామంటున్నారు. విద్యుత్ సబ్సిడీకి మేం మిమ్మల్ని డబ్బులు అడిగామా? అని ప్రశ్నించారు.
-
విశ్వగురు విశ్వరూపం బయటపడుతోంది- సీఎం కేసీఆర్
విద్యుత్ సంస్కరణలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. చట్టాలు చేయడం వెనక్కి తీసుకోవడం మీకు అలవాటే కదా అని కేంద్రంపై ఫైర్ అయ్యారు కేసీఆర్. విశ్వగురు విశ్వరూపం బయటపడుతోందని మండిపడ్డారు. శ్రీలంకలో మోడీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయన్నారు.
-
నేను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తా- సీఎం కేసీఆర్
నేను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తా సీఎం కేసీఆర్ సవాల్ చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కేంద్రం అనాలోచిత నిర్ణయం వల్ల తెలంగాణ 25వేల కోట్ల ఆర్థిక లోటును ఎదుర్కొంటుంది. తెలంగాణ , మహారాష్ట్రల్లోని గ్రామలు తెలంగాణలో కలపాలని కోరుతున్నాయన్నారు. ఇతర ఖర్చులు తగ్గించుకొని ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. 20 రోజుల పాటు సభ నడుపుకుందాం.
-
హిట్లర్.. ముస్సోలి లాంటి వాళ్ళే పోయారు- సీఎం కేసీఆర్
హిట్లర్.. ముస్సోలి లాంటి వాళ్ళే పోయారు.. కాలం సమాధానం చెప్తుందన్నారు. అధికారం నెత్తికి ఎక్కి మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ మండి పడ్డారు. ఏ పార్టీని ఉండనియమని కేంద్ర హోంమంత్రి మాట్లాడతారు. కేంద్రంను పాలిస్తున్న పార్టీకి ఏనాడు 50 శాతం ఓట్లు రాలేదని స్పష్టం చేశారు. 36 శాతం ఓట్లు చూసుకుని మురిసి పోతున్నారని కేసీఆర్ అన్నారు.
-
మోడీ ప్రభుత్వం మొదటి క్యాబినెట్ లోనే తెలంగాణ గొంతు నొక్కింది- సీఎం కేసీఆర్
మోడీ ప్రభుత్వం మొదటి క్యాబినెట్ లోనే తెలంగాణ గొంతు నొక్కిందని మండిపడ్డారు. మన మండలాలు.. సీలేరు ప్రాజెక్టు గుంజుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోనియా గాంధీ తెలంగాణ బిల్లు ఫైనల్ స్టేజ్ కి వచ్చే సరికి తెలంగాణకు కేటాయింపులో సీలేరు ఇచ్చారు మనకని గుర్తు చేశారు. సింగరేణి కూడా మనకే కేటాయించిందని అన్నారు. మోడీ.. మోస్ట్ ఫాసిస్ట్ ప్రధాని అని మండిపడ్డారు. మొదటి సారి మోడీ నీ వ్యతిరేకించింది నేనే.. తెలంగాణ బంద్ కి పిలుపు నిచ్చింది నేనే అని సీఎం కేసీఆర్ అన్నారు.
-
రఘునందన్ రావు సత్యదూరం మాటలు- సీఎం కేసీఆర్
రఘునందన్ రావు సత్యదూరం మాటలు చెప్తున్నారు. సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి కలారస్తుంది బీజేపీ అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం బాధ్యత.. ఇది రాచరిక కాదు. పవర్.. ఉమ్మడి జాబితా లోనిది అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రాలను అడగకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా చేస్తుంది కేంద్రం అని విమర్శించారు. అధికార పార్టీ సభ్యులు ఎక్కువ ఉండి ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా చేసింది బీజేపీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెజిట్ లో, లేదు అని అబద్దం చెప్తున్నారు రఘునందన్ రావు అని మండిపడ్డారు.
-
Rtcని ఎవరు ముందు అమ్మితే వాళ్లకు వెయ్యి కోట్ల నజరానా అటా- సీఎం కేసీఆర్
Rtc అమ్మేయండి అన్నది, ఎవరు ముందు అమ్మితే వాళ్లకు వెయ్యి కోట్ల నజరానా అంటా అని కేసీఆర్ కేంద్రం పై విరుచుకుపడ్డారు. బీజేపీ కి...కేంద్రంకి మద్య ఏదో గ్యాప్ ఉన్నట్టుంది అని ఎద్దేవ చేశారు. బీజేపీ చెప్పే దానికి కేంద్రం చేస్ దానికి తేడా ఉందని సీఎం మండిపడ్డారు. సంస్కరణ అనే అందమైన ముసుగు తొడిగి దోచుకుంటుంది కేంద్రం అన్నారు. అమ్మేసుడే పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
కేంద్రం రైతుల నోట్లో కేంద్రం మట్టికొడుతుంది-కేసీఆర్
వడ్లు వెయ్యండి కొంటం అన్నారు. తీరా వేసిన తర్వత కొంటాం అన్నోడు పత్తా లేకుండా పోయారన్నారు. బీజేపీ ఎంపీలు, మంత్రులు నిష్క్రియాపర్వంగా మారిపోయారని మండిపడ్డారు. మేమంతా ధర్నా చేస్తే... కేంద్ర మంత్రి అవమానం చేస్తున్నారన్నారు. తెలివితక్కువ కేంద్ర ప్రభుత్వం అని మండిపడ్డారు. రైతుల నోట్లో కేంద్రం మట్టికొడుతుందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
ఇలాంటి దరిద్రులు ఎక్కడి నుంచి దాపురించారు-సీఎం కేసీఆర్
దేశంలో ప్రజాస్వామ్యము ఉండవద్దట. కొందరు బీజేపీ నేతలు మాట్లాడతారు. ఎక్కడి నుంచి ఈ దరిద్రులు దాపురించారని తీవ్రంగా విమర్శించారు. మరగుజ్జులు ఎక్కడి నుండి వచ్చారన్నారు. మహాత్ముడు పుట్టిన నేల మీద కూల్చేస్తాం ..కల్చేస్తం అనే మరగుజ్జులు పుట్టారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
-
వేరే పార్టీ లే లేకుండా చేస్తాం అంటున్నారు చెయ్ చూద్దాం.. సీఎం కేసీఆర్
వేరే పార్టీలే లేకుండా చేస్తాం అంటున్నారు చెయ్ చూద్దాం అని అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసిరారు. దేశంలో ఏక పార్టీ ఉంటది అంటారు.. అన్ని పార్టీలను బ్యాన్ చేయండి ఎవరో ఉండేదో తేలుతుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీని ఉండనియమని కేంద్ర హోంమంత్రి మాట్లాడతారు. కేంద్రంను పాలిస్తున్న పార్టీకి ఏనాడు 50 శాతం ఓట్లు రాలేదని స్పష్టం చేశారు. 36 శాతం ఓట్లు చూసుకుని మురిసి పోతున్నారు. హిట్లర్.. ముస్సోలి లాంటి వాళ్ళే పోయారు.. కాలం సమాధానం చెప్తుందన్నారు. అధికారం నెత్తికి ఎక్కి మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ మండి పడ్డారు.
-
వీళ్ల మాటలతో భరతమాట గుండెకు గాయం
వీళ్ల మాటలతో భరతమాట గుండెకు గాయమావుతుందన్నారు సీఎం కేసీఆర్. బీజేపీ ఎంపీలు, మంత్రులు నిష్క్రియాపర్వంగా మారిపోయారని మండిపడ్డారు. మేమంతా ధర్నా చేస్తే... కేంద్ర మంత్రి అవమానం చేస్తున్నారన్నారు. తెలివితక్కువ కేంద్ర ప్రభుత్వం అని మండిపడ్డారు. రైతుల నోట్లో కేంద్రం మట్టికొడుతుందని అన్నారు. ఎక్కడ అయిన మేము చర్చకు రెడీ అన్నారు.