Site icon NTV Telugu

KTR : రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సీలింగ్.. కేంద్రం పరిష్కరించాల్సిందే

Ktr

Ktr

KTR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మాట్లాడారు. పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును బీఆర్‌ఎస్‌ తరఫున స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సబ్‌ప్లాన్‌ను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. బలహీన వర్గాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే మాట్లాడుతుందని, కానీ గతంలో బీసీల కోసం కేసీఆర్‌ గట్టిగా పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంలో ఓబీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లినవారే కేసీఆర్‌ అని కేటీఆర్‌ అన్నారు. తమ ప్రభుత్వంలో అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌ పదవులు బీసీలకు ఇచ్చామని చెప్పారు. రాహుల్‌ గాంధీ కంటే ముందే బీఆర్‌ఎస్‌ కులగణన అవసరమని ప్రతిపాదించిందని ఆయన గుర్తు చేశారు. రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం సీలింగ్‌ విధించిందని, అది కేంద్రం పరిష్కరించాల్సిన అంశమని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Rashmika : మరో హారర్‌ చిత్రంలో రష్మిక?

Exit mobile version