Payal Shankar : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టంచేశారు. అయితే బీసీలకు ఉన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌పై అసెంబ్లీలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. “బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. మీ చేతిలో ఉన్న అధికారాన్ని పంచిపెట్టడంలో ఏమాత్రం అభ్యంతరం ఉంది?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
India China Relation: పరస్పర విశ్వాసం ఆధారంగా సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేలు ఏం జరిగిందని పాయల్ శంకర్ నిలదీశారు. బీసీలలో ప్రభుత్వానికి నమ్మకస్తులు లేరా? మీ మంత్రి వర్గంలో, కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఎంతమందిని బీసీలకు ఇచ్చారో చెప్పాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో బీసీ కార్పొరేషన్లు కలకలలాడేవని, కానీ ఇప్పుడు తాళాలు వేసుకున్న పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. “మంత్రి వర్గంలో బీసీలకు చోటు లేదు, కార్పొరేషన్ చైర్మన్‌ల పదవుల్లో అవకాశం లేదు. అయితే బీసీలు ఓటు వేయడానికే పనికివస్తారా? కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావడానికే పనికివస్తారా?” అని మండిపడ్డారు.
NBK : బాలయ్యని చుస్తే.. ఏదో ఒకటి తీసి కొట్టాలనిపిస్తుంది : తమన్
