Harish Rao: ఆంధ్రా పాలకుల హయాంలో కన్నీళ్ళు పెట్టిన తెలంగాణ పల్లెలు…నేడు కళకళలాడుతున్నాయని ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావు అన్నారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. సిద్దిపేట డిగ్రీ కాలేజీలో జాతీయ జండాను హరీష్ రావు ఆవిష్కరించారు. సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకులు తెలంగాణ వ్యవసాయాన్ని చిన్న చూపు చూశారని మండిపడ్డారు. రైతు బాధలను అవహేళన చేశారని అన్నారు. వ్యవసాయం దండగ అంటూ చిత్రీకరించారని గుర్తు చేశారు. ఆంధ్రా పాలకుల హయాంలో కన్నీళ్ళు పెట్టిన తెలంగాణ పల్లెలు…నేడు కళకళలాడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అడుగు పెట్టగానే సగం రోగం నయమయ్యేలా అద్భుతాలను సాకారం చేసుకున్నామని అన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులను మైమరిపించేలా సర్కారు ఆస్పత్రులను తీర్చిదిద్దికున్నామని తెలిపారు. స్వర్ణప్రాషన్ ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండడానికి ఉపయోగపడుతుందని అన్నారు. గతంలో ఈ డ్రాప్స్ ని పిల్లలందరికీ క్రమం తప్పకుండా ఇచ్చేవారు. ఈ కార్యక్రమం కోసం స్వర్ణప్రాషన్ తయారు చేసేందుకు ముందుకు వచ్చిన హరే కృష్ణ హరే రామ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కోటి 10 లక్షల రూపాయల స్వర్ణప్రాషన్ తయారుచేసి ఉచితంగా పంచేందుకు ముందుకు వచ్చిన హరే కృష్ణ హరే రామ సంస్థ వారికి ధన్యవాదాలన్నారు.
Read also: Vishwak Sen: సుట్టేసుకోవే చీరలా అంటున్న దాసన్న
ఈ డ్రాప్స్ 10 నెలలు వాడడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి ఎంతగానో ఆరోగ్యవంతంగా తయారవుతారని తెలిపారు. బంగారం ఉపయోగించి తయారు చేసే ఈ ఆయుర్వేద డ్రాప్స్ ని 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు తీసుకోవచ్చని తెలిపారు. అదే విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కండ్ల కలక రాకుండా కాపాడుకోవచ్చని సూచించారు. కండ్ల కలక గాలిలో కానీ వేరే విధంగా కానీ రాదు అది ముట్టుకోవడం వల్ల వస్తుంది. కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదు. వాటికి సంబంధించిన అన్ని ఆయింట్మెంట్స్, డ్రాప్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని అన్నారు. 3,80,000 మందికి పిల్లకి రాష్ట్రవ్యాప్తంగా కండ్ల కలక రాకుండా ఉండేందుకు ఉచితంగా నివారణ ఆయుర్వేద మందులను ప్రభుత్వం పంపిణీ చేయనుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట్ బాయ్స్ హై స్కూల్లో ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో కండ్ల కలక రాకుండా జాగ్రత్త పడేందుకు ఆయుర్వేద మందు ఉపయోగపడుతుందని తెలిపారు. కొద్ది కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే కండ్ల కలక రాకుండా జాగ్రత్త పడవచ్చని అన్నారు. ఒకవేళ వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి సరైన వైద్యం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామని మంత్రి తెలిపారు.
CM KCR: గుడ్ న్యూస్.. త్వరలోనే పీఆర్సీ.. ఉద్యోగుల వేతనాల్లో పెంపు