CM KCR: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్తగా పిఆర్సీ నియమించి.. ఉద్యోగుల వేతనాలను పెంచుతామని, అప్పటి వరకు మధ్యంతర భృతిని చెల్లిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. గోల్కొండ కోటలో 77వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను. గత ఏడాది భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నామన్నారు.
ఇప్పుడు వజ్రోత్సవాల సమాపన ఘట్టాన్ని కూడా అంతే ఘనంగా నిర్వహించు కుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరి హృదయంలో దేశాభిమానం పెంపొందించే విధంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. రాష్ట్ర ప్రజలందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. జీహెచ్ఎంసి పరిధిలో నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్స వానికి సిద్ధంగా ఉన్న లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం నేటి నుంచే అర్హులైన పేదలకు ఆదజేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందుతున్న సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశాయని అన్నారు.
కానీ, వారి ప్రయత్నాలను వమ్ముచేస్తూ అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు విజయవంతంగా ఆమోదం పొందిందని అన్నారు. త్వరలోనే కొత్తగా పీఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతామని, అప్పటివరకూ మధ్యంతర భృతిని చెల్లిస్తామని ఇటీవలి శాసనసభా సమావేశాల్లో నేను స్వయంగా ప్రకటించానని అన్నారు. రాష్ట్రం అవతరించిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చామని తెలిపారు. ఇప్పటి వరకు రెండు పిఆర్సీల ద్వారా 73శాతం ఫిట్మెంట్ అందించామన్నారు.
త్వరలోనే కొత్తగా పిఆర్సీ నియమించి, ఉద్యోగుల వేతనాలను పెంచుతామని, అప్పటి వరకు మధ్యంతర భృతిని చెల్లిస్తామని తెలిపారు.
Read also: CM KCR: వారి పాలనలో తెలంగాణలోని అన్నిరంగాలు విధ్వంసానికి గురయ్యాయి..!
75 ఏళ్ల స్వతంత్ర భారతం సాధించిన ప్రగతి గణనీయమైనదే అయినా, ఆశించిన లక్ష్యాలను, చేరవల్సిన గమ్యాలను మాత్రం ఇంకా చేరలేదనే చెప్పాలి. ప్రకృతి ప్రసాదించిన వనరులు, కష్టించి పనిచేసే ప్రజలు ఉన్నప్పటికీ పాలకుల అసమర్థత, భావదారిద్ర్యం ఫలితంగా వనరుల సద్వినియోగం జరగడంలేదు. అన్నీఉండి కూడా ప్రజలు అకారణంగా అవస్థలు అనుభవిస్తున్నారు. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బలహీనవర్గాల జీవితాల్లో అలుముకొన్న పేదరికం ఇప్పటికీ తొలగిపోలేదు. వనరులను సంపూర్ణంగా వినియోగించుకొని ప్రగతి ఫలాలు అన్నివర్గాల అభ్యున్నతికి సమానంగా ఉపయోగపడిన నాడే సాధించుకున్న స్వాతంత్ర్యానికి సార్థకత అని సవినయంగా మనవి చేస్తున్నాను. దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో అహింసాయుతంగా, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.
Rana: దుల్కర్… సోనమ్ లకి సారీ చెప్పిన రానా