Site icon NTV Telugu

Teacher Posts Recruitment: టీఎస్‌పీఎస్సీ ద్వారా టీచర్ పోస్టుల భర్తీ..! ప్రభుత్వం సంకేతాలు..

Tspsc 2

Tspsc 2

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతుందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.. దీనిపై ఇవాళ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ సంకేతాలు ఇచ్చారు.. టీచర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందన్నారు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన… దీనిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో సమావేశాలు కూడా జరిగినట్టు ఆమె వెల్లడించారు.. మొత్తంగా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.. మరోవైపు.. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో రెండున్నర లక్షల మంది విద్యార్థులు చేరినట్టు వెల్లడించారు దేవసేన… అన్ని స్కూళ్లలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేశామన్న ఆమె… అవసరం అయితే విద్యా వాలంటీర్లను తీసుకుంటామని వెల్లడించారు..

Read Also: DGP Rajendranath Reddy: ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై స్పందించిన డీజీపీ..

కాగా, టీచర్ల పోస్టుల భర్తీకి సిద్ధమైన ప్రభుత్వం.. ఇప్పటికే టెట్‌ నిర్వహించింది.. గతంలోనూ టెట్‌ క్వాలిఫై అయిన వారు ఎప్పుడు డీఎస్సీ వేస్తారా? అనే ఎదురుచూస్తున్నారు.. టెట్‌లో క్వాలిఫై అయినవారు.. ఎప్పుడైనా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో.. కోచింగ్‌ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు.. మరి టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్‌ ఇస్తుంది..? తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తారా? అనేది విషయాలపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.

Exit mobile version