NTV Telugu Site icon

Bandi sanjay: తెలంగాణ భవిష్యత్తును మార్చేందుకే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు

Bandi Sanjay

Bandi Sanjay

Bandi sanjay: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నికలు కాబోతున్నయని బీజేపీ తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉపాధ్యాయ, అధ్యాపక అత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రజల పీక పిసికి చంపుతారా?…కాపాడుకుంటారో మీరే ఆలోచించుకోండి అంటూ అన్నారు. ఏవీఎన్ రెడ్డిని గెలిపిస్తే… సర్కార్ మెడలు వంచి పీఆర్సీని వేసేలా పోరాడతామన్నారు. 317 జీవోసహా టీచర్ల సమస్యలపై పోరాడతామని తెలిపారు. ఏవీఎన్ రెడ్డిని గెలిపించకపోతే టీచర్ల సమస్యలపై ప్రశ్నించే వాళ్లే మిగలరని వ్యాఖ్యానించారు బండి సంజయ్‌. ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలివి అన్నారు. ఫస్ట్ తేదీన జీతాలు రావాలంటే ఏవీఎన్ రెడ్డిని గెలిపించండి అని కోరారు. బరాబర్ హిందుత్వం మాట్లాడతా…. మేం ఏ మతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం టీచర్లకే పరిమితం కావు.. ఇవి తెలంగాణ ప్రజల తల రాతనే మార్చే ఎన్నికలు కాబోతున్నాయని తెలిపారు. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో.. బండి సంజయ్ అఫ్ట్రాల్ కార్పొరేటర్… ఆయనను అధ్యక్షుడు చేస్తే ఏమైతదని ట్విట్టర్ టిల్లు అన్నడు.. మా నాయన ఉపాధ్యాయుడు… సిద్ధాంతాల కోసం పనిచేస్తున్నా. నేను ఏనాడూ మా నాన్న పేరు చెప్పుకుని రాలేదని, మీ అయ్య లేకపోతే మిమ్ముల్ని కుక్కలు కూడా దేఖవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో చిప్పలు కడిగొచ్చిన మీకు, నా క్యారెక్టర్ కు పొంతనా?అంటూ మండిపడ్డారు.

Read also:Black Grapes: నల్లద్రాక్షను ఖాళీ కడుపున తింటే ప్రమాదమా? నిజమెంత?

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు… తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ఇవే చివరి ఎన్నికలు.. ఆ తరువాత వచ్చేవి అసెంబ్లీ ఎన్నికలు. తెలంగాణ ప్రజలంతా ప్రాథేయపడి అడుగుతున్నరు. బీఆర్ఎస్ గెలిస్తే మా బతుకులు ఆగమైతయని ఆందోళన చెందుతున్నరని బండి సంజయ్‌ అన్నారు. నేను ఎక్కడికి పోయినా ప్రజలంతా ఇదే చెప్పమని వేడుకుంటున్నారని అన్నారు. ఫస్ట్ నాడు మీకు జీతాలు వస్తే ఓటేసుకోండి… ఎన్నికలున్న జిల్లాల్లో మాత్రమే ఫస్ట్ జీతాలిస్తున్నడు.. బీజేపీ మాట్లాడితే తప్ప జీతాలు ఇయ్యలేని పరిస్థితి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పీఆర్టీయూ, యూటీఎప్ సహా ఉపాధ్యాయ సంఘాల సభ్యులంతా వాస్తవాలు ఆలోచించండి. మీరు మాకు శత్రువులు కాదు.. కేసీఆర్ మోచేతి నీళ్లు తాగేవాళ్లు మాత్రమే మాకు శత్రువు. ఏవీఎన్ రెడ్డికి ఓటేయకపోతే చారిత్రక తప్పిదం చేసిన వాళ్లవుతారని అన్నారు. మీకో విషయం గుర్తుంచుకోవాలి… ఏవీఎన్ రెడ్డిని గెలిపిస్తే ఇకపై మీకు ఫస్ట్ నాడే జీతాలు రావడం ఖాయమన్నారు. ఎందుకుంటే… అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నయ్. జీతాలియ్యకపోవడంవల్లే ఏవీఎన్ రెడ్డిని గెలిపించారని ఒళ్లు దగ్గర పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు. ఇది తెలిసే ఉద్యోగ సంఘాలను పిలిచి ఒక్కొక్కరికి రూ. 5 కోట్లు ఆఫర్ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మిమ్మల్ని మళ్లీ లోబరర్చుకునేందుకు, ఆశ పెట్టేందుకు యత్నిస్తున్నారు తస్మాత్‌ జాగ్రత్త అంటూ సూచించారు బండి సంజయ్‌.
Aligarh Mosque: హోలీ సందర్భంగా అలీగఢ్ మసీదుకు ముసుగు..

Show comments