ఏపీలో డిసెంబర్ 5న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నిక ఫలితాలు రేపు(డిసెంబర్ 9) వెలువడనున్నాయి. టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు కాకినాడ జేఎన్టీయూలో జరిగే టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షించారు.
తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 12లోగా ఎన్నిక నిర్వహణ పూర్తి చేయాలని నిర్ణయించారు.. ఈ నెల 18 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ భవిష్యత్తును మార్చే ఎన్నికలు కాబోతున్నయని బీజేపీ తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉపాధ్యాయ, అధ్యాపక అత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.