YS Sharmila: చంద్రబాబు ఇంటికి షర్మిల.. వైఎస్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila: హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకురాలు షర్మిల ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి హాజరుకావాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్‌లను కూడా ఆహ్వానించారు. కాగా, షర్మిల తనయుడు రాజా రెడ్డికి ప్రియా అట్లూరితో ఈ నెల 18న నిశ్చితార్థం జరిగి ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న విషయం తెలిసిందే. చంద్రబాబును పెళ్లి ప్రతిక ఇచ్చి ఆహ్వానించామని అన్నారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు పంచుకున్నారన్నారనిషర్మిల అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చంద్రబాబు కుటుంబానికి కేక్ పంపినట్లు ఆమె తెలిపారు. లోకేష్ తనకు బహుమతి కూడా పంపారని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబు పెళ్లికి తప్పకుండా హాజరవుతానని చెప్పారని అన్నారు. చంద్రబాబుని సాధారణంగా చూడాలని అన్నారు. ఫ్రెండ్లీ గా ఉండాలన్నారు. రాజకీయాలు మా ప్రొఫెషన్.. జీవితాలు కాదన్నారు. ఒకరినొకరు మాటలు అనుకుంటాం.. రాజకీయంగా బాబుకు మాకు లావాదేవీలు ఉండవన్నారు. రాజకీయాలు ఫ్రెండ్లి గా ఉండాలని షర్మిల అన్నారు.
Read also: Bangladesh Cricket Board: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రాజీనామా
Also Read
- Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని.. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు ప్రముఖులు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేస్తున్నారు. తాజాగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తొలి ఆహ్వాన పత్రికను ఉంచి.. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. కాబోయే వధూవరులను కూడా అక్కడికి తీసుకెళ్లారు. ఆ తర్వాత తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. తర్వాత ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌లో చేరారు. కుమారుడి పెళ్లి తర్వాత షర్మిల రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. వైఎస్సార్టీపీ కాంగ్రెస్‌లో విలీనమైన నేపథ్యంలో అధిష్టానం ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమిస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Uddhav Thackeray: కాలారామ్ ఆలయంలో హారతికి రావాలని రాష్ట్రపతికి ఉద్దవ్ ఠాక్రే ఆహ్వానం..
తాజావార్తలు
-
Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
-
Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
-
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
Japan Cricket Team: జపాన్ ఆటగాళ్ల పేర్లు చూస్తే మైండ్ బ్లాంక్..? మన కామెంటేటర్లకు చుక్కలే పో..!
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!