Site icon NTV Telugu

Alliance: కాంగ్రెస్‌కే అతి గతి లేదు.. వాళ్లతో పొత్తా..?

రాహుల్‌ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖండించడం.. ప్రధాని మోడీ, బీజేపీ అధిష్టానంపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అవ్వడంతో… మళ్లీ కాంగ్రెస్‌ వైపు కేసీఆర్‌ చూస్తున్నారంటూ రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.. ఈ తరుణంలో కాంగ్రెస్‌ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్.. తెలంగాణ భవన్‌లో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఓవైపు బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు కాంగ్రెస్‌కు చురకలు అంటించారు.. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్‌గా సీఎం కేసీఆర్‌ ఎప్పుడు మాట్లాడలేదన్న ఆయన.. అస్సాం ముఖ్యమంత్రి కామెంట్స్ పై మాత్రమే మాట్లాడారని గుర్తు చేశారు. ఇక, కాంగ్రెస్‌ పార్టీకే అతి గతి లేదు.. వాళ్లతో మాకు పొత్తు ఏంటి? అని ప్రశ్నించారు.

Read Also: YS Jagan: రైతులకు గుడ్‌న్యూస్‌.. రేపే ఆ సొమ్ము ఖాతాల్లోకి..

ఇక, తెలివి లేని మంత్రులు కేంద్రంలో ఉన్నారని మండిపడ్డారు తలసాని.. బీజేపీ వాళ్లు ఎక్కువ మాట్లాడితే మీ సంగతి ఏమి అవుతుందో చూసుకోండి? అని హెచ్చరించిన ఆయన.. మీరు పనికి రాని చేత గాని దద్దమ్మలు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. తెలంగాణ అంటే ప్రధాని మోడీకి కుళ్లు, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు.. ఈక్వాలిటీ గురించి తెలియని ప్రధాని మోడీ.. రామానుజ విగ్రహ ఆవిష్కరణకి వచ్చి మాట్లాడతాడు అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. ఆర్మీని కూడా రాజకీయాలకు వాడుకున్న పార్టీ బీజేపీయే అని.. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదన్నారు..

Exit mobile version