అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మూడు రోజులు మహిళా దినోత్సవ కార్యక్రమం శుభపరిణామం అన్నారు మంత్రి తలసాని. తాగునీటి కోసం మహిళలు అనేక ఇబ్బందులు పడేవారు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు ప్రభుత్వం అందిస్తుందన్నారు.
ప్రసూతి మహిళలకు కేసీఆర్ కిట్ అందిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలను 50 శాతం పెంచాం. పేద, మధ్య తరగతి మహిళలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నాం. దేశంలోనే ఈ కార్యక్రమం ఎక్కడ లేదు. ఈ ఏడాది నుంచి హెల్త్, ఎడ్యుకేషన్ కు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు మంత్రి. షీ టీమ్స్ లేని సమయంలో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు, షీ టీమ్స్ వల్ల ప్రస్తుతం మహిళలకు భద్రత లభించింది. నగరాన్ని శాసించే వ్యక్తి మహిళ కావటం సంతోషం. కోవిడ్ సమయంలో పారిశుధ్య కార్మికులు, ఆరోగ్య సిబ్బంది సేవలు మరువలేమని ప్రశంసించారు తలసాని శ్రీనివాసయాదవ్.
మహిళలకు ప్రభుత్వం బ్రహ్మాండమైన కార్యక్రమాలు అమలు చేస్తుంది. అడ బిడ్డకు కల్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలు ఇచ్చిన ఘనత దేశంలో ఎక్కడైనా వుందా అని మంత్రి తలసాని ప్రశ్నించారు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన మహిళా బంధు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కార్యక్రమానికి ప్రభుత్వ శాఖలోని మహిళలు హాజరయ్యారు.
