Site icon NTV Telugu

Talasani Srinivas Yadav : కొంచెం బుద్ధి, జ్ఞానంతో బండి సంజయ్ మాట్లాడాలి

Talasani Srinivas

Talasani Srinivas

తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిన్న తెలంగాణ కురుస్తున్న భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేశారు. ఆ తరువాత కేంద్రం ప్రభుత్వం, బీజేపీ నేతలపై నిప్పులు చేరిగారు కేసీఆర్‌. అయితే సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఖండిస్తూ.. విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. కొంచెం బుద్ధి …జ్ఞానం తో బండి సంజయ్ మాట్లాడాలని హితవు పలికారు. అంతేకాకుండా.. ముందు పార్లమెంట్ ను రద్దు చేయమనండి…మేము మా కేసీఆర్ తో మాట్లాడతామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఒకలా మాట్లాడితే… బీజేపీ నేతలు మరోలా మాట్లాడ్తున్నారని ఆయన మండిపడ్డారు.

Big Breaking : మరోసారి సోనియా గాంధీకి ఈడీ నోటీసులు

తెలంగాణ ప్రజలు మమ్మల్ని అయిదేళ్ళు పాలించమని అధికారం ఇచ్చారని, బీజేపీ నేతలు ఫుట్ పాత్ మీద ఉన్నారు.. వాళ్లు ఏదైనా మాట్లాడతరు అంటూ ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రిటైర్ మెంట్ కేసు అన్న తలసాని.. ప్రజలు మోడీ, కేంద్ర మంత్రుల ఇళ్ళలోకి వెళతారని అది చూసుకోమని చెప్పండంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీసు శాఖకు మంచి పేరు ఉందని, కొన్ని పొరపాట్లు జరిగినంత మాత్రాన అది ప్రభుత్వంకు అంట గట్టే ప్రయత్నం చేయవద్దని ఆయన వెల్లడించారు. ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము.. నెత్తి మీద పెట్టుకొము కదా ? అని ఆయన వెల్లడించారు.

 

Exit mobile version