Talasani Srinivas Yadav : కందికొండ మరణించడం చాలా బాధాకరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Talasani Srinivas Yadav Condolence to Lyricist Kandikonda Yadagiri Passes away.
ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నేతలు కూడా ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. ‘తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన, వరంగల్ బిడ్డ కందికొండ మరణం, తెలంగాణ సాహిత్య లోకానికి సబ్బండ వర్గాలకు తీరని లోటు’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను సృష్టించిన తెలంగాణ బిడ్డ కందికొండ అని స్మరించుకున్నారు. ఆయనను కాపాడుకునేందుకు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదని అవేదన వ్యక్తం చేస్తూ కందికొండ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read
అయితే తాజాగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా కందికొండ మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన .. కందికొండ యాదగిరి మరణించడం చాలా బాధాకరమన్నారు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గొప్ప పాటలు రాశారని, తెలంగాణ సమాజం, ఉద్యమం కోసం పాటలు రాశారన్నారు. కుటుంబానికి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, తెలంగాణ సమాజానికి తీరని లోటని ఆయన వ్యాఖ్యానించారు. కందికొండ కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్‌దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!