Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Super Response For Hmda Prebid Meetings

HMDA Prebid Meetings: ప్రీబిడ్ మీటింగ్స్ సక్సెస్ ..ఆన్ లైన్ ఆక్షన్ పై ఆసక్తి

Published Date :March 5, 2022 , 7:04 am
By NTV WebDesk
HMDA Prebid Meetings: ప్రీబిడ్ మీటింగ్స్ సక్సెస్ ..ఆన్ లైన్ ఆక్షన్ పై ఆసక్తి
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో భూములు, ఇళ్ళ స్థలాలకు భారీ గిరాకీ ఏర్పడింది. అందులోనూ ప్రభుత్వం డెవలప్ చేసి అమ్మకానికి పెడితే ఆ లే అవుట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ (hmda) చేపడుతున్న ప్రీ బిడ్ మీటింగ్ లకు అనూహ్య స్పందన లభిస్తోంది. బండ్లగూడ, బహదూర్​ పల్లి, ఖమ్మం పరిధిలో నిర్వహించిన ప్రీబిడ్​ మీటింగ్స్​ సక్సెస్ అయ్యాయి. రాజీవ్​స్వగృహ భూములు, టవర్స్​ కొనుగోలు కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. అధిక సంఖ్యలో హాజరైన ఔత్సాహికులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న ఆన్​ లైన్​ వేలం ప్రక్రియ గురించి అధికారులు వారికి అవగాహన కల్పించారు. హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​ మెంట్​అథారిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మూడు చోట్ల నిర్వహించిన ‘‘ప్రీబిడ్​ మీటింగ్స్’’​ విజయవంతం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాజీవ్​ స్వగృహకు సంబంధించిన ప్లాట్లు, టవర్స్​ను ఆన్​లైన్​ వేలం(ఈ–ఆక్షన్​) పద్దతిలో విక్రయాలకు పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో భాగంగా బండ్లగూడ(నాగోల్​–హైదరాబాద్​) రాజీవ్​ స్వగృహ టవర్స్​(అపార్ట్​ మెంట్స్​) ప్రాంగణంలో శుక్రవారం ఉదయం మొదటి ప్రీబిడ్​సమావేశం జరిగింది.

అదేవిధంగా మేడ్చల్​ మల్కాజ్​గిరి జిల్లా పరిధిలోని బహదూర్​ పల్లి(దుండిగల్​ మున్సిపాలిటీ)లో 101 ప్లాట్ల విక్రయాలపై శుక్రవారం మధ్యాహ్నం రెండో దఫా ప్రీబిడ్​ మీటింగ్​ ను హెచ్​ఎండిఏ అధికారులు నిర్వహించారు. ఈ రెండు ప్రీబిడ్​ సమావేశాలకు హెచ్ఎండిఏ చీఫ్​ ఇంజినీర్​ బిఎల్​ఎన్​ రెడ్డి, రాజీవ్​ స్వగృహ కార్పొరేషన్​ చీఫ్​ ఇంజినీర్​ డాక్టర్​ ఎస్​.ఈశ్వరయ్య, హెచ్ఎండిఏ సెక్రెటరీ చంద్రయ్య, ఎస్టేట్​ ఆఫీసర్​ గంగాధర్​, ఓఎస్డీ ఎం.రాంకిషన్​, సీజీఎం మాజీద్​ షరీఫ్​ లతో పాటు ఆన్​ లైన్​ వేలం నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్​టీసీ అధికారులు హాజరయ్యారు.

https://ntvtelugu.com/internal-conflicts-in-chevella-trs-mla-kale-yadaiah-vs-ex-mla-ks-ratnam-in-chevella/

రాజీవ్​ స్వగృహ కార్పొరేషన్​ చీఫ్​ ఇంజినీర్​ ఈశ్వరయ్య మాట్లాడుతూ నాగోల్​ బండ్లగూడ వద్ద 26 ఎకరాల విస్తీర్ణంలో 33 టవర్స్​(అపార్ట్ ​మెంట్స్​)లతో మొత్తం 2,700 ఫ్లాట్లను రాజీవ్​ స్వగృహ కార్పొరేషన్​ నిర్మించిందని, వాటిలో కేవలం 500 ఫ్లాట్లు విక్రయించినట్లు తెలిపారు. మిగతా వాటిల్లో చాలా వరకు రెడీ టు ఆక్యుపై (నివాసానికి సిద్ధంగా) ఉన్నాయని చెప్పారు. 2008 సంవత్సరంలో ముంబయికి చెందిన అర్కిటెక్చర్​ కంపెనీతో డిజైన్​ చేయించి నిర్మించిన ఇక్కడి అపార్ట్​ మెంట్​ జీహెచ్​ఎంసీ పరిధిలో అన్నిరకాల మౌళిక వసతులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్​ స్వగృహకు సంబంధించిన ఎనిమిది టవర్స్​(అపార్ట్​ మెంట్స్​) ప్రీబిడ్​ సమావేశం శుక్రవారం నాడు ఖమ్మం మున్సిపల్​ కమిషనర్​ ఆదర్శ్​ సురభి, హెచ్​ఎండిఏ సూపరింటెండెంట్ ఇంజనీర్​ యూసుఫ్​ హుస్సేన్​ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ఖమ్మం మున్సిపల్​ కార్పొరేషన్లో జరిగిన ప్రీబిడ్​ సమావేశంలో కమిషనర్​ వేలం ప్రక్రియకు సంబంధించిన నియమ నిబంధనలను వివరించారు. హెచ్​ఎండిఏ నిర్వహిస్తున్న బాధ్యతల గురించి యూసుఫ్​ హుస్సేన్​ వివరించారు. మొత్తం మీద రాబోయే రోజుల్లో హెచ్ఎండీయే ఇతర కార్పోరేషన్లు నిర్మించే ఫ్లాట్లు, డెవలప్ చేసి ఇచ్చే ప్లాట్లకు అనూహ్యమయిన డిమాండ్ ఏర్పడనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bahadurpally
  • Bandlaguda
  • Flats
  • HMDA Hyderabad
  • hmda prebid

తాజావార్తలు

  • iPhone 17e.. చౌకగా అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్.. పనితీరు ఎలా ఉందంటే..?

  • Weather Update: బిగ్ అల‌ర్ట్.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు

  • Unseasonal Rains Damage: అకాల వర్షాలతో భారీ నష్టం.. ఆరు జిల్లాల్లోని 16 మండలాలపై అధిక ప్రభావం

  • Mahindra BE 6 Batman Edition: 999 మంది ఓనర్ల ఆగ్రహం.. మహీంద్రా సరెండర్.. BE 6 బ్యాట్‌మాన్ ఎడిషన్‌కు పూర్తి బైబ్యాక్!

  • Gate Results: గేట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions