తెలంగాణలో ఇంటర్ విద్యా సంవత్సరం ఈసారి ఆలస్యంగా ప్రారంభం కానుంది.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మే 20వ తేదీ నుండి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రారంభం కానుండగా.. జూన్ 15వ తేదీ నుంచి జూనియర్ కాలేజీలు పునః ప్రారంభం కాబుతున్నాయి.. ఇక, జులై 1వ తేదీ నుండి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.. అయితే, ఈ ఏడాది 15 రోజులు ఆలస్యంగా ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఇంటర్ పరీక్షలు ఆలస్యం కావడంతో వచ్చే విద్యా సంవత్సరంపై ప్రభావం పడే అవకాశం కూడా ఉంది.. దీనికి ప్రాధాన కారణం టెన్త్ పరీక్షలే అంటున్నారు.. 10వ తరగతి పరీక్షలు ఆలస్యం కావడంతో ఇంటర్ మొదటి సవత్సరం తరగతులు కూడా ఆలస్యంగా ప్రారంభం కాబోతున్నాయి.
Read Also: GST on gaming: ఆన్‌లైన్ గేమ్స్‌పై జీఎస్టీ.. షాకిచ్చిన కేంద్రం..!